రెండు కుటుంబాల మధ్య ఘర్షణ.. తల్వార్, రాడ్లతో దాడి

రెండు కుటుంబాల మధ్య ఘర్షణ.. తల్వార్, రాడ్లతో దాడి

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో రెండు కుటుంబాల మధ్య ఘర్షణ జరిగింది. ఓ కుటుంబం మరో కుంటుంబాన్ని వెంటపడి కొట్టింది. ఒకరినొకరు కత్తులు, తల్వార్లు, రాడ్లతో విచక్షణారహితంగా దాడి చేసుకున్నారు. ఈ దాడిలో ఇద్దరు కత్తిపోట్లకు గురయ్యారు. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. 

ఏం జరిగిందంటే..

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ సర్కిల్ లోని సులేమాన్ నగర్ కి చెందిన ఓ కుంటుంబం రెచ్చిపోయింది. తల్వార్లు, రాడ్లతో మరో కుటుంబంపై దాడికి పాల్పడింది. దాడిని అడ్డుకున్న వారిపై కూడా దాడి చేశారు. మా జోలికి వస్తే చంపేస్తామంటూ బెదిలించారు.  అయితే ఓ కుటుంబం ఇంటి ముందు ఉన్న కారుపై మరో కుటుంబానికి సంబంధించిన మేకలు కూర్చున్నాయి. వాటిని కారుపై ఎక్కనివ్వకుండా వేరే ఎక్కడైనా తీసుకెళ్లండి అని మరో కుటుంబం గట్టిగా వార్నింగ్ ఇచ్చింది.  దీంతో మా మేకలనే వేరే దగ్గరికి తీసుకెళ్లమంటారా? అన్న కోపంతో.. ఆ కుటుంబంపై ఎగబడి కొట్టారు.  ఇద్దరు వ్యక్తులను కత్తితో పొడిచారు.  అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని స్థానిక ఆసుత్రికి తరలించారు. 

ఈ ఘటనను చూసిన స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. బాధిత కుటుంబం ఫిర్యాదు మేరకు అత్తపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.