TRS, కాంగ్రెస్ నేతల మధ్య తోపులాట.. ఉద్రిక్తత

TRS, కాంగ్రెస్ నేతల మధ్య తోపులాట.. ఉద్రిక్తత

హైదరాబాద్: ముషీరాబాద్ లో టెన్షన్ వాతావరణం ఏర్పడింది. TRS, కాంగ్రెస్ నేతల మధ్య తోపులాట జరగడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. శుక్రవారం హైదరాబాద్ లో కురిసిన భారీ వర్షానికి సెల్లార్ లో వర్షపు నీరి షార్ట్ సర్క్యూట్ అయి ముషీరాబాద్ కు చెందిన హైకోర్టు ఉద్యోగి రాజ్ కుమార్ చనిపోయారు. దీంతో రాజ్ కుమార్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ముషీరాబాద్ లోని ఆయన ఇంటి ముందు యూత్ కాంగ్రెస్ నేతలు ధర్నాకు దిగారు.

ఆసమయంలో అటుగా వెళ్తున్న ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ ను కాంగ్రెస్ నేతలు అడ్డుకున్నారు. రాజ్ కుమార్ ఇంటి వద్దకు తీసుకొచ్చి బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. TRS కార్యకర్తలు కూడా అక్కడికి చేరుకోవడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. నేతలు ఒకరినొకరు తోసుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది.