కేటీఆర్ ముందే బీఆర్ఎస్ నేతల మధ్య గొడవ 

కేటీఆర్ ముందే బీఆర్ఎస్ నేతల మధ్య గొడవ 

మంత్రి కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ వర్గపోరు భగ్గుమన్నది. మార్చి 25వ తేదీ శనివారం మంత్ర కేటీఆర్ ముందే ఎల్బీనగర్ బీఆర్ఎస్ నేతల మధ్య విభేదాలు బయటపడ్డాయి. శనివారం ఎల్బీనగర్ ఫ్లైఓవర్ ప్రారంభానికి మంత్రి కేటీఆర్ హాజరైయ్యారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ ఎల్బీ నగర్ ఇంచార్జ్ రామ్మోహన్ గౌడ్.. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వర్గీయుల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది.

ఎమ్మెల్యే వర్గీయులు చంపాపేట్ బీఆర్ఎస్ నాయకులు, మాజీ కార్పొరేటర్ రమణారెడ్డిని స్టేజీ నుండి కిందకు దించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో గొడవ ప్రారంభమైనట్లు తెలుస్తోంది. మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్న సమయంలోనే నేతల మధ్య గొడవ జరగడంతో రాజకీయ వర్గాల్లో చర్చాంశనీయంగా మారింది. ఈ ఘర్షణలో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. రంగంలోకి దిగిన పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఎమ్మెల్యే అనుచరులు దాడి చేసే క్రమంలో మాజీ కార్పొరేటర్ రమణారెడ్డి పరుగులు తీసి తప్పించుకున్నారు.

అనంతరం మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి.. తామందరం ఓకేటే పార్టీకి చెందిన వాళ్లమని.. తాము కొట్టించాలనుకుంటే వాళ్లు ప్రోగ్రామ్ లకు కూడా రారని తెలిపారు. గొడవకు గల కారణాన్ని ఆయన వివరించారు. స్టేజీపైన ఓ మహిళా కార్పొరేటర్ కూర్చింది.. రమణారెడ్డి ఆమె దగ్గరగా నిల్చోవడంతో ఆమెకు అసౌకర్యంగా అనిపించి పక్కకు జరగమని చెప్పింది. అయినా వినకపోవడంతో పక్కకు జరుగమని నేను కూడా చెప్పానని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి చెప్పారు. దాంతో రామ్మోహన్ గౌడ్ వర్గీయులు తనపై కోపంగా మాట్లాడారని.. దీంతో గొడవ మొదలైందన్నారు.