
పది ఫలితాల్లో విద్యార్థుల ఉత్తీర్ణత శాతం గణనీయంగా పెరిగింది. కానీ రాష్ట్రస్థాయిలో రంగారెడ్డి జిల్లా 22వ స్థానానికి పడిపోయింది. గతేడాది 16వ స్థానం దక్కగా, ఈసారి ఏకంగా 6 స్థానాలు కిందకు దిగింది. అయినా ఉత్తీర్ణత శాతం 92.83శాతానికి పెరిగింది. గతేడాది విద్యార్థులు ఉత్తీర్ణత శాతం 87.13శాతం మాత్రమే ఉంది. ఈ ఏడాది కూడా బాలికలు పైచేయి సాధించారు. జిల్లాలో సగటు విద్యార్థుల ఉత్తీర్ణత 92 శాతం ఉండగా, బాలుర ఉత్తీర్ణత 91.56 శాతం ఉంది. అయితే బాలికల ఉత్తీర్ణత 94.18 శాతం కావడడం విశేషం. జిల్లాలో పదో తరగతి పరీక్షలకు మొత్తం45,747 మంది విద్యార్థులు హాజరు కాగా, ఇందులో42,467 మంది ఉత్తీర్ణులయ్యారు. వీరిలో బాలురు23,651 మంది పరీక్షలకు హాజరుకాగా 21,656 మంది ఉత్తీర్ణులయ్యారు. అలాగే 22,096 మంది బాలికలు పరీక్షలకు హాజరుకాగా 20,811మంది ఉత్తీర్ణులయ్యారు. జిల్లాలో 28 మంది విద్యార్థులు 10/10 జీపీఏ సాధించారు. వీరిలో 16 మంది జిల్లా పరిషత్ ఉన్నత, 12 మంది తెలంగాణ మోడల్ స్కూల్స్ విద్యార్థులు ఉండడం గమనర్హం. జిల్లాలోని ప్రభుత్వ, కేజీవీబీ, మోడల్, గురుకులాలకు సంబంధించిన 40 స్కూల్స్‌లో వంద శాతం ఉత్తీర్ణత సాధించినట్లు జిల్లా విద్యాశాఖాధికారి సత్యనారాయణ రెడ్డి తెలిపారు.
రీ -వెరిఫికేషన్‌కు దరఖాస్తు ….
జిల్లాలోని విద్యార్థులు రీ- వెరిఫికేషన్‌కు మంగళవారం నుంచి దరఖాస్తు చేసుకోవచ్చునని విద్యాశాఖాధికారి తెలిపారు. దరఖాస్తు ఫారం, హాల్‌టికెట్‌తో పాటు తదితర జీరాక్స్ పత్రాలను సమర్పించేందుకు ఎల్బీనగర్‌లోని జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నతా పాఠశాలల్లో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేశారు. అసక్తిగల విద్యార్థులు ప్రతి పేపర్‌కు రూ.వెయ్యి చొప్పున www.bse.telangana.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించాలని సూచించారు. దరఖాస్తు చేసుకున్న ప్రతి పేపర్‌కు పోస్టు ద్వారా రీ- వెరిఫికేషన్ పత్రాలు పంపిస్తారని తెలిపారు. అదేవిధంగా రీ-కౌటింగ్ కోసం ఈనెల 27వ వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
సంవత్సరాల వారీగా ఫలితాల వివరాలు….
సంవత్సరం హాజరైన విద్యార్థులు పాసైన విద్యార్థులు ఉత్తీర్ణత శాతం
2015 88,208 61,814 70.10
2016 90,607 74,360 82.09
2017 42,706 36,164 84.68
2018 43,392 37,809 87.13
2019 45,747 42,467 92.83
2019 విద్యార్థుల వివరాలు ….
విద్యార్థులు హాజరు పాస్ ఉత్తీర్ణత శాతం
బాలురు 23,651 21,656 91.56
బాలికలు 22,096 20,811 94.18
మొత్తం 45,747 42,467 92.83
పాఠశాలలు హాజరైన విద్యార్థులు ఉత్తీర్ణులైన విద్యార్థులు ఉత్తీర్ణత శాతం
జిల్లాపరిషత్ 13,416 11,439 85.26
ప్రభుత్వ పాఠశాల 382 292 76.44
మోడల్ స్కూల్ 826 794 96.13
కేజీవీబీ 720 664 92.22
టీఎంఆర్‌ఎస్ 85 79 92.94
టీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్ 551 529 96.01
బీసీడబ్ల్యూఆర్ 39 38 97.44
ఎయిడెడ్ 145 139 95.86
ప్రైవేట్ 29,725 28,625 96.30
మొత్తం 45,889 42,599 92.83
జూన్‌లో అడ్వాన్స్ సప్లిమెంటరీ…....
టెన్త్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 10 నుంచి 24వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు విద్యాశాఖాధికారులు తెలిపారు. పరీక్ష ఫీజు చెల్లింపునకు ఈనెల 27 చివరి తేదీ, ఆయా పాఠశాలల యాజమానులు జిల్లా విద్యాశాఖకు ఫీజు చెల్లింపు 29 చివరి తేదీగా నిర్ణయించారు. విద్యార్థుల వివరాలను ఈనెల 31వ వరకు సమర్పించాలి. జిల్లా విద్యాశాఖ కు జూన్ 3వరకు సమర్పించాల్సిన షెడ్యూల్ విడుదల చేశారు.