మియాపూర్‎లో స్కూల్ బిల్డింగ్ పై నుంచి పడి 10వ తరగతి విద్యార్థి మృతి

 మియాపూర్‎లో స్కూల్ బిల్డింగ్ పై నుంచి పడి 10వ తరగతి విద్యార్థి మృతి

హైదరాబాద్: 10వ తరగతి విద్యార్థి స్కూల్ బిల్డింగ్ పై నుంచి కిందపడి మృతి చెందాడు. ఈ విషాధ ఘటన మియాపూర్‎లోని మధుర నగర్‎లో జరిగింది. వివరాల ప్రకారం.. రిజ్వాన్ (15) అనే బాలుడు మధుర నగర్‎లోని సెయింట్ మార్టిన్ స్కూల్‎లో 10వ తరగతి చదువుతున్నాడు. రోజుమాదిరిగానే శనివారం (జూలై 19) పాఠశాలకు వెళ్లిన రిజ్వాన్.. ప్రమాదవశాత్తూ స్కూల్ బిల్డింగ్ నాలుగో అంతస్తు నుంచి కిందపడ్డాడు. తీవ్రంగా గాయపడిన రిజ్వాన్‎ను పాఠశాల సిబ్బంది హుటాహుటిన ఆసుపత్రికి తరలించింది.

గాయాల తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఆసుపత్రిలో చికిత్స పొందూతూ రిజ్వాన్ మరణించాడు. కుమారుడి మృతితో రిజ్వాన్ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. రిజ్వాన్ ప్రమాదవశాత్తూ కిందపడ్డడా.. లేక మరేదైనా కారణం ఉందా అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.