
గండిపేట, వెలుగు: హైదర్షాకోట్ జడ్పీ స్కూల్లో పదో తరగతి క్లాస్ లీడర్‌ను ఎన్నుకునే ప్రక్రియను వినూత్నంగా నిర్వహించారు. సాధారణ ఎన్నికలను తలపించేలా పోలింగ్ ద్వారా ఈ ఎన్నిక జరిగింది. టెన్త్ క్లాస్ లీడర్ కోసం మొత్తం 11 మంది బరిలో నిలిచారు. ఒక బాయ్ హెడ్, ఒక గర్ల్ హెడ్ కోసం ఎలక్షన్లు పెట్టారు. పోటీలో ఉన్న స్టూడెంట్స్‌కు గుర్తులను ఇచ్చారు. బ్యాలెట్ విధానంలో మిగతా విద్యార్థులతో ఓట్లు వేయించారు. ఎన్నికల స్పెషల్ అధికారి, రిటర్నింగ్ ఆఫీసర్లు, ప్రైజటింగ్ ఆఫీసర్లుగా పలువురు విధులు నిర్వహించారు. కార్యక్రమంలో హెచ్ఎం సైదిరెడ్డి, టీచర్లు పాల్గొన్నారు.