బషీర్బాగ్, వెలుగు: రాష్ట్రంలో నిలకడగా ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారం పుంజుకోవడానికి విధి విధానాలు రూపొందించాలని తెలంగాణ జన సమితి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం ప్రభుత్వాన్ని కోరారు. వ్యాపారులు ఎదుర్కొంటున్న సమస్యలపై రిపోర్ట్ తయారుచేసి ప్రభుత్వానికి సమర్పిస్తామన్నారు. తెలంగాణ రియల్ ఎస్టేట్ అసోసియేషన్ 2026 క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో భాగంగా మంగళశారం నాంపల్లిలోని జన సమితి కార్యాలయంలో ఆయన మాట్లాడారు.
రాష్ట్ర జీడీపీలో 25 శాతం వాటా ఉన్న రియల్ ఎస్టేట్ రంగాన్ని సజీవంగా ఉంచాల్సిన బాధ్యత ప్రతి వ్యాపారిపై ఉందన్నారు. సమగ్రమైన శాస్త్రీయ ఆలోచనలతో ప్రతిపాదనలు తయారుచేసి ప్రభుత్వానికి సూచనలు ఇవ్వడానికి సదస్సు నిర్వహించాలని సూచించారు. సదస్సుకు రియల్ ఎస్టేట్ ప్రముఖులు, అసోసియేషన్ నాయకులు, బిల్డర్లు, ప్రభుత్వ పెద్దలను ఆహ్వానించి చర్చ పెట్టాలని కోరారు.
