రేపటి నుంచి 6, 7 తరగతి విద్యార్థులకు క్లాసులు పునః ప్రారంభం

రేపటి నుంచి 6, 7 తరగతి విద్యార్థులకు క్లాసులు పునః ప్రారంభం

అమ‌రావ‌తి: ఏపీలో రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 6, 7 తరగతి విద్యార్థులకు క్లాసులు పునః ప్రారంభం కానున్నాయి. కరోనా తర్వాత రేపటి నుంచి స్కూల్ విద్యార్థులకు క్లాసులు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే 8, 9 ,10 తరగతులు రోజు మార్చి రోజు క్లాసులు జరుగుతున్నాయి. అయితే సోమ‌వారం నుంచి 9, 10 తరగతుల క్లాసులు రోజూ జరుగుతాయని విద్యా శాఖ అధికారులు తెలిపారు. ఇప్పటివరకు 8, 9, 10 తరగతులు రోజు మార్చి రోజు జరుగుతున్నాయి. మంగళగిరి మండలంలోని ప్రెవేట్ ,గవర్నమెంట్ స్కూల్స్ లో 6,7 తరగతి విద్యార్థులు దాదాపు రెండు వేల మంది హాజరు కానున్నారు.