స్పీకర్ పదవి గౌరవాన్ని పెంచే దిశగా కృషి చేయాలి: స్పీకర్స్ కాన్ఫరెన్స్లో అమిత్ షా

స్పీకర్ పదవి గౌరవాన్ని పెంచే దిశగా కృషి చేయాలి: స్పీకర్స్ కాన్ఫరెన్స్లో అమిత్ షా

ఢిల్లీలో ఆఅఖిల భారత స్పీకర్ల సమావేశాన్ని ప్రారంభించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. కేంద్ర శాసనసభకు తొలి భారతీయ స్పీకర్‌గా విఠల్‌భాయ్ పటేల్ ఎన్నికైన శతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని ఆదివారం (ఆగస్టు24)  నుంచి రెండు రోజులపాటు ఈ సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో విఠల్‌భాయ్ పటేల్,భారత పార్లమెంటరీ సంస్థల పరిణామానికి సంబంధించిన అరుదైన ఆర్కైవల్ రికార్డులు, ఫొటోలు, డాక్యుమెంట్లను ప్రదర్శించే ప్రత్యేక ప్రదర్శనను కూడా హోంమంత్రి ప్రారంభించారు.

హోంమంత్రి మాట్లాడుతూ..దేశ స్వేచ్ఛ ఎంత ముఖ్యమో, స్వాతంత్ర్యం తర్వాత దేశాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా నడపడం కూడా అంతే ముఖ్యమని నొక్కి చెప్పారు. భారతీయుల ఆలోచనల ఆధారంగా దేశాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా నడపడానికి పునాది వేసే పని విఠల్‌భాయ్ పటేల్ చేశారని అన్నారాయన.  

సభ గౌరవాన్ని, స్పీకర్ పదవి గౌరవాన్ని పెంపొందించడానికి కృషి చేయవలసిన అవసరాన్ని షా నొక్కిచెప్పారు. మన దేశ ప్రజల సమస్యలను లేవనెత్తడానికి సభ నిష్పాక్షికమైన వేదికను అందించాలన్నారు అమిత్ షా. సభ నిబంధనల ప్రకారం సభ సక్రమంగా జరిగేలా చూసుకోవడం ప్రతి సభ్యుని బాధ్యత అని అన్నారు.AI- ఆధారిత సాధనాలు వంటి డిజిటల్ ఆవిష్కరణలపై ప్రత్యేక దృష్టి సారించి, చట్టనిర్మాణంలో పారదర్శకత, సామర్థ్యం ,ప్రతిస్పందనను బలోపేతం చేయడం ఈ సమావేశం లక్ష్యం అన్నారు అమిత్ షా. 

పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ..రెండు రోజుల పాటు జరిగే స్పీకర్ల సమావేశం.. శాసనసభల నిర్వహణకు కొత్త విధానాలను అన్వేషించేందుకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో పార్లమెంటు ,అసెంబ్లీలు కేంద్ర బిందువులని..రెండూ సరిగ్గా పనిచేయకపోతే, ప్రజాస్వామ్యంపై ప్రశ్నలు తలెత్తుతాయని రిజిజు అన్నారు. పార్లమెంటు ,రాష్ట్ర అసెంబ్లీలు సజావుగా పనిచేయడం చాలా ముఖ్యమైనదని ఆయన నొక్కి చెప్పారు. వ్యతిరేకత ,అడ్డంకి మధ్య వ్యత్యాసం ఉందని ప్రతిపక్షం సభ్యుల హక్కు అని, కానీ వారు పనితీరును అంతరాయం కలిగించలేరని రిజిజు అన్నారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర శాసనసభల స్పీకర్లు ,డిప్యూటీ స్పీకర్లతో పాటు రాష్ట్ర శాసనమండలి చైర్మన్లు ,డిప్యూటీ చైర్మన్లను పాల్గొన్నారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వి.కె. సక్సేనా, ఢిల్లీ సీఎం  రేఖ గుప్తా, మంత్రులు కూడా హాజరయ్యారు.