Intelligence Bureau Recruitment 2025:ఇంటెలిజెన్స్ బ్యూరోలో జాబ్స్.. జీతం81వేలు..లాస్ట్ డేట్ సెప్టెంబర్ 14

Intelligence Bureau Recruitment 2025:ఇంటెలిజెన్స్ బ్యూరోలో జాబ్స్.. జీతం81వేలు..లాస్ట్ డేట్ సెప్టెంబర్ 14

నిరుద్యోగులకు గుడ్ న్యూస్..ఇంటెలిజెన్స్ బ్యూరోలో వివిధ రకాల పోస్టుల భర్తీకి నోటిఫిషన్ విడుదలయ్యింది. కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలోని ఇంటెలిజెన్స్ బ్యూరో(IB) 2025 సంవత్సరానికి గాను జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ (JIO) గ్రేడ్ 2 పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 23,2025నుంచి ప్రారంభమై సెప్టెంబర్ 14న ముగుస్తుంది. అప్లికేషన్ ఫీజు చెల్లించేందుకు లాస్ట్ డేట్ సెప్టెంబర్ 14, 2025. 

ఖాళీల వివరాలు

మొత్తం ఖాళీల సంఖ్య: 394
జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ (JIO) గ్రేడ్-II/టెక్: 394 పోస్టులు
ఈ ఖాళీలు వివిధ కేటగిరీల (జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ) వారీగా విభజించారు. 

విద్యార్హతలు

అభ్యర్థులు ఈ క్రింది అర్హతలలో ఏదో ఒకటి కలిగి ఉండాలి:
ఎలక్ట్రానిక్స్ లేదా ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్స్‌లో డిప్లొమా.
కంప్యూటర్ సైన్స్ లేదా కంప్యూటర్ అప్లికేషన్స్‌లో డిప్లొమా.

సైన్స్ సబ్జెక్టులతో (ఫిజిక్స్, గణితం) హయ్యర్ సెకండరీ (12వ తరగతి) పూర్తి చేసి, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీర్స్ (IETE) నుంచి ఎలక్ట్రానిక్స్/కమ్యూనికేషన్ విభాగంలో అసోసియేట్ మెంబర్‌షిప్ ఎగ్జామినేషన్ పాస్ అవ్వాలి.

వయస్సు పరిమితి

అభ్యర్థి వయస్సు 18 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మాజీ సైనికులకు వయస్సులో సడలింపు ఉంటుంది.

జీతం

ఎంపికైన అభ్యర్థులకు పే స్కేల్ లెవెల్ 4 ప్రకారం రూ.25,500 నుంచి రూ.81,100 వరకు జీతం ఉంటుంది.
ఇది కాకుండా ఇతర ప్రభుత్వ భత్యాలు (అలవెన్సులు) కూడా లభిస్తాయి.

ఎంపిక ప్రక్రియ

ఎంపిక ప్రక్రియలో మూడు దశలు ఉంటాయి:
టైర్ I: ఆన్‌లైన్ పరీక్ష (ఆబ్జెక్టివ్ టైప్)
జనరల్ నాలెడ్జ్, రీజనింగ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ ,టెక్నికల్ సబ్జెక్టులపై ప్రశ్నలు ఉంటాయి.
టైర్ II: స్కిల్ టెస్ట్ (Skill Test) ,డాక్యుమెంట్ వెరిఫికేషన్
టైర్ III: ఇంటర్వ్యూ/పర్సనాలిటీ టెస్ట్

ఎలా అప్లయ్ చేయాలంటే.. 

ఆసక్తి ఉన్న అభ్యర్థులు హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MHA) అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.అభ్యర్థులు ముందుగా తమ వివరాలతో రిజిస్టర్ చేసుకోవాలి.

అవసరమైన అన్ని పత్రాలు (విద్యార్హతల సర్టిఫికెట్లు, ఫోటో, సంతకం) స్కాన్ చేసి అప్‌లోడ్ చేయాలి.అప్లికేషన్ ఫీజుచెల్లించి, ఫారంను సమర్పించాలి.

ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు ,ఖచ్చితమైన సమాచారం కోసం దయచేసి అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించగలరు.