
- ర్యాష్ డ్రైవింగ్ చేస్తే గ్రీన్ కార్డు, వీసా రద్దు బిల్లుకు ఆమోదం
- హోం ల్యాండ్ సెక్యూరిటీ శాఖ మద్దుతు
అమెరికాలోని ఎన్నారైలకు మరోకష్టం వచ్చింది.ఇటీవల వీసా లేకుండా అమెరికాలో ఉండేవాళ్లను, తప్పుడు పత్రాలతో ఆ దేశంలో నివసించేవారిని వెతికి పట్టి మరీ బహిష్కరించిన ట్రంప్ ప్రభుత్వం.. తాజాగా వలసదారులను దేశం నుంచి బయటికి పంపేందుకు మరో చట్టాన్ని రెడీ చేస్తోంది.అదే ర్యాష్ డ్రైవింగ్ వీసా, గ్రీన్ కార్డు క్యాన్సలేషన్ బిల్.. ఇది గనక చట్టం అయితే అమెరికాలో ఉంటున్న ఎన్నారైలకు కష్టాలు తప్పవు..పొరపాటున ర్యాష్ చేశారా..అంతే..దేశం నుంచి బహిష్కరణమే..పూర్తి వివరాల్లోకి వెళితే..
2025లో వలస నియంత్రణలో భాగంగా ఇటీవల ట్రంప్ ప్రభుత్వం rule-breaking Visa Cancellation bill దీనినే ర్యాష్ డ్రైవింగ్ వీసా, గ్రీన్ కార్డు క్యాన్సలేషన్ బిల్ అని అంటారు. దీనికి వైట్ హౌజ్ ఆమోదం తెలిపింది.
తాజాగా శనివారం హోం ల్యాండ్ సెక్యూరిటీ శాఖకూడా ఈ బిల్లుకు సపోర్టు చేసింది. ఈ బిల్లు ప్రకారం.. రాష్ డ్రైవింగ్, డ్యూయి వంటి ట్రాఫిక్ నేరాలకు (reckless driving, DUI) పాల్పడి విదేశీయులు పట్టుబడితే వారి వీసా, గ్రీన్ కార్డు, ఇతర వలస హక్కులు రద్దు అవుతాయి. ఈ వివరణాత్మక చట్ట ప్రతిపాదనకు వైట్ హౌజ్, హోం ల్యాండ్ సెక్యూరిటీ శాఖ పూర్తిగా మద్దతిచ్చాయి . ట్రంప్ అధికారికంగా సంతకం చేశారు.
ఈ బిల్లుచట్టం అయితే విదేశీ డ్రైవర్లకు అమెరికాలో స్థిరపడే అవకాశం ఉండదు. ట్రాఫిక్ కోర్ట్ లో దోషిగా తేలితే వీసా స్వయంగా తొలగిస్తారు. అప్పీల్ కి అవకాశాలు తక్కువే.
ఈ బిల్లు చట్టం అయితే అమెరికాలో తాత్కాలిక, శాశ్వత వీసాలు, గ్రీన్ కార్డ్ పై ఉన్న అమెరికన్ డ్రైవింగ్ నిబంధనలు మరింత కఠినతరం అయ్యాయి.
అన్ని రాష్ట్ర DMVలు (డ్రైవింగ్ లైసెన్స్ అథారిటీలు), ట్రాఫిక్ కోర్టులు ఎన్ఫోర్స్మెంట్కు USCIS (వలస శాఖ)కి ఇంటిగ్రేట్ చేస్తారు.గ్రీన్ కార్డు దరఖాస్తుదారులు ట్రాఫిక్/డ్రైవింగ్ హిస్టరీ కోసం ప్రత్యేక వెరిఫికేషన్ తప్పనిసరి చేశారు.
బెల్ జిల్లా నిబంధనలు: ట్రాఫిక్ కోర్టుల్లో తప్పిదం నిరూపణ కాగానే వీసా/గ్రీన్ కార్డ్ వెంటనే రద్దు
డ్రైవింగ్ రికార్డు వేటింగ్ సమయంలో USCIS హెచ్చరిక నోటీసులు పంపిస్తారు.
రాష్ డ్రైవింగ్, మానవహనం వంటి నేరాలకు ప్రవాసుల డిపోర్టేషన్ (తక్షణ పంపించివేత) అధికారి స్వతంత్ర నిర్ణయం గా ఉంటుంది.