
ఈ ఫొటో చూడగానే అమ్మో.. అమ్మో.. ఇదంతా ఒరిజినల్ క్యాషేనా.. అని ఆశ్చర్యపోతున్నారా..? అస్సలు ఎలాంటి డౌటనుమానం మీకు అక్కర్లేదు. ఇదంతా ఒరిజినల్ కరెన్సీనే. 5 వందల రూపాయల నోట్ల కట్టలే. ఐదు కాదు.. పది కాదు.. ఏకంగా 12 కోట్ల ఇండియన్ కరెన్సీ ఇది. కర్ణాటకలో ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యేకు సంబంధించిన 30 చోట్ల ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చేసిన తనిఖీల్లో కోట్ల కొద్దీ నోట్ల కట్టలు బయటపడ్డాయి. ఇల్లీగల్ ఆన్ లైన్, ఆఫ్ లైన్ బెట్టింగ్ కేసులో కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే కేసీ వీరేంద్రను ఈడీ అరెస్ట్ చేసింది. సిక్కింలోని గ్యాంగ్ టక్లో ఎమ్మెల్యే దొరికిపోయాడు.
ఈ ఎమ్మెల్యే, ఆయన సన్నిహితుల ఇళ్లలో తనిఖీలు చేసిన ఈడీ అధికారులు 12 కోట్ల డబ్బు, 6 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు, 10 కేజీల వెండి ఆభరణాలు, నాలుగు లగ్జరీ కార్లను సీజ్ చేశారు. ఈ 12 కోట్ల డబ్బులో ఒక కోటి వరకూ ఫారెన్ కరెన్సీ కూడా ఉండటంతో అధికారులు విస్తుపోయారు. ఈ కేసులో 17 బ్యాంకు అకౌంట్లను, రెండు బ్యాంకు లాకర్లను కూడా ఈడీ ఫ్రీజ్ చేసింది. ఎమ్మెల్యే వీరేంద్ర సోదరుడు కేసీ నాగరాజ్, అతని కొడుకు ఎన్ రాజ్ పేరిట ఉన్న అక్రమాస్తులకు సంబంధించిన డాక్యుమెంట్స్ను కూడా ఈడీ అధికారులు సీజ్ చేశారు. కేసీ తిప్పేస్వామి, పృథ్వీ ఎన్ రాజ్ దుబాయ్ నుంచి ఈ ఆన్ లైన్ గేమింగ్ వ్యవహారాన్ని నడిపిస్తున్నట్లు ఈడీ గుర్తించింది.
Also read:-అసలు ఆట ఇప్పుడే స్టార్ట్.. డబ్బు వర్షం కురిపించనున్న క్యాజువల్ గేమ్స్
ఎమ్మెల్యే ఈ కేసులో నేరుగా ఇన్వాల్వ్ అయినట్లు ఈడీ విచారణలో వెల్లడైంది. ఎమ్మెల్యే వీరేంద్రను అరెస్ట్ చేసి ప్రొసీడింగ్స్ ప్రకారం.. తొలుత గ్యాంగ్ టక్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ముందు హాజరుపర్చారు. ఒక్క బెట్టింగ్ వ్యవహారమే కాదు గోవాలో సదరు ఎమ్మెల్యేకు ఐదు క్యాసినోలు కూడా ఉన్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. King567, Raja567, Puppy’s003, Rathna Gaming పేర్లతో ఆన్ లైన్ బెట్టింగ్ సైట్స్ ను ఎమ్మెల్యే కేసీ వీరేంద్ర నడిపిస్తున్నట్లు ఈడీ తనిఖీల్లో వెల్లడైంది. దుబాయ్ లో తన సోదరుడు కేసీ తిప్పేస్వామి ఎమ్మెల్యేకు చెందిన Diamond Softech, TRS Technologies, Prime9Technologies చూసుకుంటున్నాడు. ఈ మూడూ కూడా గేమింగ్ బిజినెస్కు చెందిన కాల్ సెంటర్లుగా దర్యాప్తులో తేలింది.
The Enforcement Directorate today arrested KC Veerendra, Karnataka's MLA from Chitradurga constituency, from Gangktok in connection with illegal online and offline betting case and recovered amount of approximately Rs 12 crore in cash, including approximately one crore in foreign… pic.twitter.com/HXpF1auWlD
— ANI (@ANI) August 23, 2025