Balakrishna: ‘వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్’లో బాలకృష్ణ.. తొలి భారతీయ సినీ నటుడిగా హిస్టరీ క్రియేట్

Balakrishna: ‘వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్’లో బాలకృష్ణ.. తొలి భారతీయ సినీ నటుడిగా హిస్టరీ క్రియేట్

హీరో నందమూరి బాలకృష్ణ వరుస సినిమాలతోనే కాదు, వరుస సత్కారాలతో ముందుకెళ్తున్నారు. 2025 జనవరి 25న భారత అత్యున్నత మూడో పురస్కారం పద్మ భూషణ్ అవార్డు వరించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే బాలకృష్ణ మరో అరుదైన ఘనత సాధించారు.

UKలోని ది వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో (WBR) బాలకృష్ణ పేరు నమోదు చేసుకున్నారు. భారతీయ సినిమా రంగంలో హీరోగా తన 50 సంవత్సరాల అద్భుతమైన కెరీర్‌కు గాను, (ఆగస్ట్ 30న) బుక్ ఆఫ్ రికార్డ్స్ సత్కరించనుంది. ఇండియన్ సినీ హిస్టరీలో ఈ ఘనత సాధించిన మొదటి హీరోగా బాలకృష్ణ నిలిచారు. ఈ ప్రత్యేక గుర్తింపు బాలకృష్ణ అంకితభావం మరియు కళాత్మకతక సేవలను గుర్తుచేస్తుంది.

ఈ సందర్భంగా బాలకృష్ణ పెద్ద కుమార్తె నారా బ్రాహ్మణి సోషల్ మీడియా వేదికగా విషెష్ తెలిపింది. "నా తండ్రి నందమూరి బాలకృష్ణ గారికి హృదయపూర్వక అభినందనలు! ప్రముఖ హీరోగా 50 సంవత్సరాలు, ఇప్పుడు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో ఒక ఘనత! మీరు నిజమైన ప్రకృతి శక్తి, తెరపై ఒక ఐకాన్. సమాజానికి కరుణామయ నాయకుడివి. మీ అద్భుతమైన ప్రయాణానికి ఈ ప్రపంచవ్యాప్త గుర్తింపు లభించినందుకు చాలా గర్వంగా ఉంది. మా గర్వం, మా హీరో!" అని బ్రాహ్మణి తన అభిప్రాయాన్ని పంచుకుంది. 

బాలకృష్ణ.. 'తన తండ్రి నందమూరి తారక రామారావు' వారసత్వాన్ని పుణికి పుచ్చుకొని, నటనలో తండ్రికి తగ్గ తనయుడిగా ప్రేక్షకులను ఆకట్టుకుంటూ అంచలంచలుగా ఎదుగుతున్నారు. అలా సినీ పరిశ్రమలోనే కాకుండా హిందూపురం ఎమ్మెల్యేగా, బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్కు చైర్మన్గా సేవలందిస్తున్నారు.  ఈ క్రమంలోనే వరుస సినిమాలు, అవార్డులతో బాలయ్య రికార్డులను తిరగరాస్తున్నాడు.

►ALSO READ | OTT Thriller: తెలుగు ఓటీటీలో దూసుకెళ్తున్న మలయాళ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

ప్రస్తుతం బాలకృష్ణ-బోయపాటి కాంబోలో తెరకెక్కిన అఖండ 2 విడుదలకి సిద్దమైంది. సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. అలాగే, గోపీచంద్ మలినేనితో 'వీరసింహ రెడ్డి' తర్వాత మరో మూవీ చేస్తున్నాడు బాలకృష్ణ.