
మహబూబాబాద్ పట్టణంలో యువకులు కత్తులు, కొడవళ్ళతో హల్చల్ చేశారు. అమ్మాయి కోసం ఇద్దరు యువకుల మధ్య మొదలైన గొడవ కత్తులు, కొడవళ్ళతో దాడికి దిగేవరకు వెళ్ళింది. ఆదివారం ( ఆగస్టు 24 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. జిల్లాలోని బయ్యారం మండలానికి చెందిన ఒక వర్గం యువకులు మహబూబాబాద్ పట్టణానికి చెందిన మరో వర్గం యువకులపై కత్తులతో దాడికి పాల్పడ్డారు.
ప్రియురాలి కోసం ఇద్దరు యువకుల మధ్య మొదలైన గొడవ కత్తులతో దాడికి దిగే స్థాయికి వెళ్ళింది. ఇరువర్గాల యువకులు ఒకరిపై ఒకరు కత్తులతో దాడికి పాల్పడ్డారు. ఈ క్రమంలో స్థానికులు అడ్డుకోవడంతో ఒక వర్గం యువకులు కారులోనే కత్తులు వదిలేసి అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు స్థానికులు.
స్థానికుల సమాచారంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. పరారీలో ఉన్న బ్యాచ్ కోసం గాలిస్తున్నారు పోలీసులు. యువకుల మధ్య ఘర్షణకు కారణమైన అమ్మాయి ఎవరు?, గొడవకు గల కారణాలేంటి వంటి వివరాలపై ఆరా తీస్తున్నారు పోలీసులు.