బీఆర్ఎస్ హయాంలో పటాన్చెరులో ధరణి పేరుతో చాలా దందా చేశారు: మంత్రి వివేక్ వెంకటస్వామి

బీఆర్ఎస్ హయాంలో పటాన్చెరులో ధరణి పేరుతో చాలా దందా చేశారు: మంత్రి వివేక్ వెంకటస్వామి

పటాన్ చెరు ఇండస్ట్రియల్ ఏరియా అని.. బీఆర్ఎస్ హయాంలో ధరణి పేరుతో చాలా మంది దందా చేశారని అన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. బుధవారం (జనవరి 28) పటాన్ చెరు మండలం ఖర్దనూరు గ్రామంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తో కలిసి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ భవనానికి శంకుస్థాపన చేశారు. 

ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి వివేక్.. పటాన్ చెరుతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేశారు. ఇండస్ట్రియల్ ఏరియాలో తమకు కంపెనీ ఉందని.. అప్పట్లో నేను రోజూ వచ్చే వాడినని చెప్పారు. వివిధ ల్యాండ్ కేసులతో కోర్టుల చుట్టూ తిరిగేవాన్నని తెలిపారు. ల్యాండ్ తగాదాలు లేకుంటేనే దేశం ముందుకు వెళ్తుందన్నారు.

చాలా మంది భూమి అమ్మడామికి, కొనడానికి రిజిస్ట్రేషన్ కార్యాలయలకు వెళ్తారని.. వాళ్లకు ఇబ్బంది లేకుండా ఉండటనికి భూభారతి తీసుకువచ్చినట్లు చెప్పారు. భూభారతితో  అన్ని సమస్యలు పరిష్కరం అవుతాయని తెలిపారు. 

ఖర్ధనూరులో నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయ శంకుస్థాపన సందర్భంగా మంత్రులతో పాటు ఎమ్మెల్సీ అంజిరెడ్డి,  TGIIC చైర్మన్ నిర్మల, ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఫయీమ్, స్థానిక నేతలు హాజరయ్యారు.