జింబాబ్వేతో జరిగిన మూడు టీ20ల సిరీస్‌ను ఇండియా క్లీన్ స్వీప్ చేసింది. ఆదివారం జరిగిన మూడో టీ20లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లకు 192/5 రన్స్ చేసింది. చేజింగ్‌లో జింబాబ్వే 20 ఓవర్లలో 157/7కే పరిమితమైంది.
హరారే: శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో టీమిండియా తొలి టీ20 సిరీస్ సాధించింది. జింబాబ్వేతో జరిగిన మూడు టీ20ల సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసింది. ఆదివారం జరిగిన మూడో టీ20లో భారత జట్టు 35 పరుగుల తేడాతో విజయం సాధించింంది. హరారే స్పోర్ట్స్ క్లబ్ మైదానంలో జరిగిన ఈ ఆఖరి పోరులో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది.
లక్ష్య ఛేదనకు దిగిన జింబాబ్వే 157/7కే పరిమితమైంది. ర్యాన్ బర్ల్ (54*) ఒక్కడే రాణించాడు. వెస్లీ (28), బ్రయాన్ కరాన్ (20) ఫర్వాలేదనిపించారు. మిగతా బ్యాటర్లెవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. టీమిండియా బౌలర్లలో మయాంక్ యాదవ్ 3 వికెట్లతో మెరవగా, యశ్ ఠాకూర్ 2, అశోక్ శర్మ, రవి బిష్ణోయ్ చెరో వికెట్ పడగొట్టారు.
వైభవ్ తుఫాన్ ఇన్నింగ్స్..
అంతకు ముందు టాస్ గెలిచిన ఇండియా బ్యాటింగ్ ఎంచుకుంది. యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ తుఫాన్ ఇన్నింగ్స్ ఆడాడు. 49 బంతుల్లో 81 రన్స్ చేసి హాఫ్ సెంచరీతో విరుచుకుపడ్డాడు. అతడికి తోడుగా ఇషాన్ కిషన్ (29), శ్రేయస్ అయ్యర్ (27), రింకూ సింగ్ (25) రాణించారు. అభిషేక్ శర్మ విఫలమయ్యాడు. జింబాబ్వే బౌలర్లలో బ్రాడ్ ఎవాన్స్ 2, సికిందర్ రజా, వెస్లీ, మజురబాని ఒక్కో వికెట్ పడగొట్టారు.
వైభవ్ 102 మీటర్ల భారీ సిక్స్.. జింబాబ్వేతో మ్యాచ్‌లో పవర్ హిట్టింగ్
హరారే: జింబాబ్వేతో జరిగిన ఆఖరి టీ20 మ్యాచ్‌లో టీమిండియా యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగిపోయాడు. 49 బంతుల్లో 81 పరుగులు చేసి మ్యాచ్‌కే ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు.
ఈ ఇన్నింగ్స్‌లో అతడు కొట్టిన ఒక భారీ సిక్సర్ ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో హాట్ టాపిక్‌గా మారింది. జింబాబ్వే ఇన్నింగ్స్ 13వ ఓవర్‌లో కెప్టెన్ సికందర్ రజా వేసిన మూడో బంతికి సూర్యవంశీ క్రీజు వెలుపలికి వచ్చి, బంతి లెంగ్త్‌ను ముందే ఊహించి పవర్‌ఫుల్ షాట్ ఆడాడు.
ఆ బంతి ఏకంగా 102 మీటర్ల దూరంలో స్టేడియం బయటకు వెళ్లి పడింది.15 ఏండ్ల వయసులోనే అంతటి పవర్ హిట్టింగ్ నైపుణ్యాన్ని ప్రదర్శించడంతో స్టేడియంలోని ప్రేక్షకులు, తోటి ఆటగాళ్లు ఆశ్చర్యపోయారు. ఈ ఇన్నింగ్స్‌లో సూర్యవంశీ మొత్తం 8 ఫోర్లు, 4 సిక్సర్లు బాదాడు.102 మీటర్ల భారీ సిక్సర్‌తో పాటు 49 బంతుల్లో 81 పరుగులు సాధించి టీమిండియా192 పరుగుల భారీ స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు.
