కరోనా ఎఫెక్ట్ తో మెట్రో క్లీన్ .. సిబ్బందికి సేఫ్టీ ఏది?

కరోనా ఎఫెక్ట్ తో మెట్రో క్లీన్ .. సిబ్బందికి సేఫ్టీ ఏది?

కరోనా వైరస్ వ్యాప్తితో తెలంగాణలో అలర్ట్ అయ్యారు అధికారులు.అటు మెట్రో అధికారులు కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా మెట్రో రైలు, స్టేషన్లను క్లీన్ చేయిస్తున్నారు. డిటర్జెంట్, క్రిమిసంహారక మందులతో సిబ్బంది మెట్రోను కడుగుతున్నారు. అయితే మెట్రో రైళ్లలో ,స్టేషన్లలో క్లీన్ చేస్తున్న సిబ్బంది  ముఖానికి, చేతులకు ఎలాంటి మాస్క్ లు కానీ, గ్లోవ్స్ వేసుకోకుండా క్లీన్ చేస్తున్నారు. క్లీన్ చేసేదే వైరస్ వ్యాప్తి చెందకుండా.. మరీ సిబ్బందికి వైరస్ సోకదా? సిబ్బంది పట్ల అధికారులకు ఇంత నిర్లక్ష్యం ఏమిటంటూ విమర్శలు వస్తున్నాయి.