సాధారణంగా కారు, ఇంటి తాళాలు, హ్యాండ్‌బ్యాగ్ లాంటి వాటిని చాలామంది ఎక్కడ పెట్టారో మర్చిపోతుంటారు. ఒకచోట పెట్టి మరోచోట వెతుకుతుంటారు. అలాంటివాళ్లకు ఈ గ్లోబల్ ఐటెమ్ ట్రాకర్ బాగా సాయం చేస్తుంది. దీన్ని నాయిస్ అనే కంపెనీ తీసుకొచ్చింది. ఇది చూడడానికి చిన్న ట్యాగ్‌లా ఉంటుంది. దీన్ని కీచైన్‌లా పెట్టుకుంటే చాలు.
ఫోన్‌లో ఒక్క బటన్ నొక్కగానే ఇందులో అలారం మోగుతుంది. దాంతో తాళం చెవి ఎక్కడుందో కనిపెట్టొచ్చు. ఈ ట్రాకర్‌ని ఆండ్రాయిడ్ ‘గూగుల్ ఫైండ్ మై డివైస్’, ఆపిల్ ‘ఫైండ్ మై నెట్‌వర్క్’తో కనెక్ట్ చేసి వాడుకోవచ్చు. ఇది 90డీబీ రింగ్ వాల్యూమ్, 30 మీటర్ల అవుట్‌డోర్ రేంజ్‌తో వస్తుంది. ఇందులోని బ్యాటరీ దాదాపు సంవత్సరంపాటు పనిచేస్తుంది. తర్వాత మార్చుకోవాల్సి ఉంటుంది.
►ALSO READ | కాల దేవాలయం.. విజయపురిలో అభివృద్ది.. స్ఫూర్తితో వెలిసిన గుడి
కీ, పర్స్, బ్యాగ్, సామాన్లు.. ఇలా దేనికైనా దీన్ని ఈజీగా అటాచ్ చేయొచ్చు. అంతేకాదు.. ఇది ఐపీఎక్స్4 వాటర్ రెసిస్టెన్స్‌తో వస్తుంది. కాబట్టి వాన చినుకులు, మంచు కురిసినా తట్టుకుంటుంది. ఇందులో మూడు రింగ్ మోడ్స్ ఉంటాయి. సిమ్ కార్డ్ వేయాల్సిన అవసరం కూడా లేదు.
