రెండో విడత గొర్రెల పంపిణీకి లైన్ క్లియర్

రెండో విడత గొర్రెల పంపిణీకి లైన్ క్లియర్
  • రెండో విడత గొర్రెల పంపిణీకి లైన్ క్లియర్
  • రూ.4,563 కోట్ల రుణం ఇచ్చేందుకు ఎన్​సీడీసీ గ్రీన్ సిగ్నల్

హైదరాబాద్‌, వెలుగు: రాష్ట్రంలో రెండో విడత గొర్రెల పంపిణీకి లైన్ క్లియర్ అయింది. శుక్రవారం ఢిల్లీలో జరిగిన నేషనల్ కో ఆపరేటివ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్(ఎన్​సీడీసీ) సమావేశానికి రాష్ట్రం నుంచి పశుసంవర్థక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అధర్ సిన్హా, డైరెక్టర్ రామ్​చందర్​ హాజరయ్యారు. గొర్రెల పంపిణీ పథకం లక్ష్యాలు, అభివృద్ధి గురించి వివరించారు. ఈ మేరకు రెండో విడత గొర్రెల పంపిణీకి అవసరమైన రూ.4,563 కోట్ల లోన్ ఇచ్చేందుకు ఎన్‌సీడీసీ ఓకే చెప్పింది. రుణం మంజూరుకు గ్రీన్ సిగ్నల్ రావడంతో రాష్ట్రంలో రెండో విడత గొర్రెల పంపిణీకి రూట్ క్లియర్ అయినట్లైంది. అధికారులు త్వరలోనే గొల్ల,కురుమల నుంచి డీడీలను సేకరించనున్నారు.