పోస్టల్ ​శాఖ క్లిక్ అండ్ బుక్​ సేవలు షురూ

పోస్టల్ ​శాఖ  క్లిక్ అండ్ బుక్​ సేవలు షురూ

హైదరాబాద్, వెలుగు: కస్టమర్లకు మరింత చేరువయ్యేందుకు పోస్టల్ ​డిపార్ట్​మెంట్​నూతన సేవలను ప్రారంభించింది. ఇక నుంచి కస్టమర్లు.. స్పీడ్​పోస్టు(డాక్యూమెంట్​, పార్సిల్స్), రిజిస్టర్​ లెటర్లు, పార్సిళ్లను ఆన్​లైన్​లోనే బుక్​ చేసుకోవచ్చు.

దీనికోసం పోస్టల్​ డిపార్ట్​మెంట్​‘క్లిక్​ అండ్​ బుక్’​ పేరుతో నూతన సర్వీసును అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం ఈ సర్వీసును హైదరాబాద్​ సిటీలోని 107 పిన్​కోడ్​లలో అందుబాటులో ఉంచారు. ఆన్​లైన్​ ద్వారా స్లాట్​ను  బుక్​ చేసుకోవడానికి https://www.indiapost.gov.in/vas/Pages/IndiaPostHome.aspxలో నమోదు చేసుకోవాలి.  5 కిలోల లోపు పార్సిల్స్​ పంపించేవారికి ఈ పికప్​ సౌకర్యం అందుబాటులో ఉండనుంది. మొత్తం టారిఫ్​ 500 కంటే తక్కువగా ఉంటే  రూ.50 పికప్​ చార్జీలు వసూలు చేస్తారు. 500 కంటే పైన టారిఫ్​ ఉంటే పోస్టుమన్​ ఫ్రీగా పార్సిల్​ ను పికప్​ చేసుకుంటారు. ఆదివారాలు, గెజిటెడ్ సెలవులు మినహా మిగతా అన్ని రోజుల్లో ఈ పికప్​ సేవలు అందుబాటులో ఉండనున్నాయి.  పార్సిల్స్​ కు సంబంధించి నిషేధిత వస్తువులు ఏవో తెలుసుకోవడానికి https://www.indiapost.gov.in/MBE/Pages/Content/Prohibited-Articles.aspx వెబ్ సైట్​ను సందర్శించాలని పోస్టల్​ డిపార్ట్​మెంట్​ తెలిపింది.