
- గ్లోబల్ ఎన్విరాన్‌మెంటల్ చేంజ్ జర్నల్ స్టడీలో వెల్లడి
న్యూఢిల్లీ: ఆకాశంలో ఏర్పడే ఏడు రంగుల అద్భుతం సింగిడిని చూసి పిల్లలు, పెద్దలు ఆనందిస్తుంటారు. కానీ, ఇప్పుడా దృశ్యం క్రమంగా కనుమరుగు అవుతోందని గ్లోబల్ ఎన్విరాన్‌మెంటల్ చేంజ్ జర్నల్‌లో ప్రచురితమైన ఓ స్టడీ హెచ్చరిస్తున్నది. హవాయి వర్సిటీ నేతృత్వంలో జరిగిన ఈ స్టడీ.. వాతావరణ మార్పుల వల్ల భవిష్యత్తులో ఇండియా సహా పలు ప్రాంతాల్లో రెయిన్‌బోలు కనిపించడం తగ్గిపోతుందని వెల్లడించింది. 2100 నాటికి ప్రపంచవ్యాప్తంగా సగటున ఇంద్రధనుస్సు కనిపించే రోజులు 4.0–4.9% పెరుగుతాయని, కానీ 21–34% భూభాగాలు ఈ అందమైన దృశ్యాన్ని కోల్పోనున్నాయని వివరించింది.
వాతావరణ మార్పుల వల్ల మేఘాల కదలికలో, వర్షపాతంలో చేంజెస్ సంభవిస్తున్నాయి. గ్రీన్‌హౌస్ వాయువుల వల్ల వాతావరణం వేడెక్కడం, వర్షపాతం తగ్గడం, మేఘాలు తగ్గడం వంటి మార్పులు ఇండియాలోని కొన్ని ప్రాంతాల్లో ఇంద్రధనుస్సు కనిపించే అవకాశాలను తగ్గిస్తున్నాయని స్టడీ పేర్కొంది.