నాగబంధం మూవీ కోసం.. రూ.20 కోట్లతో క్లైమాక్స్‌‌‌‌‌‌‌‌ సీక్వెన్స్‌‌‌‌‌‌‌‌

నాగబంధం మూవీ కోసం.. రూ.20 కోట్లతో  క్లైమాక్స్‌‌‌‌‌‌‌‌ సీక్వెన్స్‌‌‌‌‌‌‌‌

‘పెదకాపు’ ఫేమ్ విరాట్ కర్ణ హీరోగా అభిషేక్ నామా దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘నాగబంధం’. అభిషేక్ పిక్చర్స్, ఎన్‌‌‌‌‌‌‌‌ఐకే  స్టూడియోస్ బ్యానర్లపై కిషోర్ అన్నపురెడ్డి, నిషిత నాగిరెడ్డి  నిర్మిస్తున్నారు.  ప్రస్తుతం నానక్‌‌‌‌‌‌‌‌రామగూడలోని రామానాయుడు స్టూడియోస్‌‌‌‌‌‌‌‌లో క్లైమాక్స్‌‌‌‌‌‌‌‌ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. కేవలం ఈ క్లైమాక్స్‌‌‌‌‌‌‌‌ సీక్వెన్స్‌‌‌‌‌‌‌‌ కోసమే రూ.20 కోట్ల వరకూ ఖర్చు చేస్తున్నామని,  పాన్ ఇండియా స్థాయిలో ఇప్పటివరకు నిర్మించిన అత్యంత ఖరీదైన క్లైమాక్స్ సీక్వెన్స్‌‌‌‌‌‌‌‌లలో ఇది ఒకటిగా నిలుస్తుందని మేకర్స్‌‌‌‌‌‌‌‌ ఈ సందర్భంగా తెలియజేశారు.  

ఓ మహాద్వారం చుట్టూ రూపుదిద్దుకున్న ఈ క్లైమాక్స్ సెట్‌‌‌‌‌‌‌‌ను ప్రొడక్షన్ డిజైనర్ అశోక్ కుమార్ డిజైన్ చేశారు. థాయ్ స్టంట్ మాస్టర్ కేచా ఖాంఫాక్‌‌‌‌‌‌‌‌డీని ప్రేక్షకులను సర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్రైజ్‌‌‌‌‌‌‌‌ చేసేలా ఈ యాక్షన్ సీన్స్‌‌‌‌‌‌‌‌ కంపోజ్ చేస్తున్నారు.  దేశంలోని ప్రాచీన విష్ణు ఆలయాల నేపథ్యంలో మైథలాజికల్ యాక్షన్ ఎంటర్‌‌‌‌‌‌‌‌టైనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో నభా నటేష్ , ఐశ్వర్య మీనన్ హీరోయిన్స్‌‌‌‌‌‌‌‌గా నటిస్తున్నారు.  జగపతి బాబు, జయప్రకాష్, మురళీ శర్మ,బి.ఎస్. అవినాష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.