నిమ్స్ లో క్లినికల్ ట్రయల్స్.. ఇద్దరికి వ్యాక్సిన్

నిమ్స్ లో క్లినికల్ ట్రయల్స్.. ఇద్దరికి వ్యాక్సిన్

వలంటీర్లకు ‘కోవాగ్జిన్‌‌’ఫస్ట్ డోస్ ఇచ్చిన డాక్టర్లు
14 రోజుల తర్వాత తేలనున్న ఫేజ్-1 రిజల్ట్

హైదరాబాద్, వెలుగు: నిమ్స్ హాస్పిటల్లో కరోనా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ ప్రక్రియ సోమవారం మొదలైంది. ట్రయల్స్ ఫేజ్–1లో భాగంగా ‘కోవాగ్జిన్ ’ తొలి డోస్ను ఇద్దరు వలంటీర్లకు ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్ డాక్టర్ ప్రభాకర్ రెడ్డి ఇచ్చారు. మిలీనియం బ్లాక్లోని ఆరో అంతస్థులో ఈ ప్రక్రియ నడుస్తోంది. వలంటీర్లు హెల్దీగా ఉన్నారని, ఎప్పటికప్పుడు హెల్త్ చెకప్ లు చేస్తున్నామని నిమ్స్ డాక్టర్లు తెలిపారు. 24 గంటలపాటు అబ్జర్వేషన్లో ఉంచి వారి ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి మంగళవారం డిశ్చార్జ్ చేస్తామన్నారు. తొలి దశ సక్సెస్ అయితే రెండు, మూడు దశ ట్రయల్స్ ఉంటాయి. ఇవి పూర్తయ్యాక వ్యాక్సిన్ అందుబాటులోకి వ‌‌చ్చే అవకాశం ఉంది.

దేశంలోని 12 చోట్ల ట్రయల్స్
క్లినికల్ ట్రయల్స్ కోసం మొత్తం 60 మంది వలంటీర్లను ఎన్నుకున్నారు. అయితే ఫేజ్–1 ట్రయల్స్ రిజల్ట్ 14 రోజుల్లో తెలియనున్నాయి. ఆ తర్వాత రెండో ఫేజ్–2 వ్యాక్సిన్ డోస్ ఇవ్వనున్నారు. ఇండియన్‌ ‌కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌‌(ఐసీఎంఆర్‌‌), నేషనల్‌ ఇన్‌‌స్టిట్యూట్‌‌ ఆఫ్‌ వైరాలజీ(ఎన్‌‌ఐవీ) సహకారంతో హైదరాబాద్‌కు చెందిన భారత్‌‌ బయోటెక్ కంపెనీ ‘కోవాగ్జిన్‌‌ ’ పేరిట వ్యాక్సిన్ ను తయారు చేస్తున్నసంగతి తెలిసిందే. నిమ్స్ సహా దేశంలోని 12 చోట్ల ఈ వ్యాక్సిన్‌‌ క్లీనికల్‌ ట్రయల్స్‌‌ జరుగుతున్నాయి. దేశీయంగా అభివృద్ధి చేస్తున్న తొలి వ్యాక్సిన్ ఇదే. వీలైతే వచ్చే నెల 15 నాటికి వ్యాక్సిన్‌‌ను సిద్ధం చేయాలని సైంటిస్టులు భావిస్తున్నారు. క్లినికల్ ట్రయల్స్ లో నిమ్స్ సూపరింటెండెంట్ డాక్టర్ నిమ్మ సత్యనారాయణ, క్లీనికల్ ఫార్మా కాలేజీ హెచ్ వోడీ డాక్టర్ ఉషారాణి, డాక్టర్లు వైఎస్ఎన్ రాజు, సుబ్రహ్మణ్యం, ఇంద్రజ, పరంజ్యోతి, పద్మజ, శ్రీనివాస్, హేమంత పాల్గొన్నారు.

కోట్లాది మందికి భరోసా కల్పించారు: గవర్నర్ ట్వీట్
కరోనా వ్యాక్సిన్ ట్రయల్ మనుషులపై ప్రయోగించటం ప్రారంభమవడంపై గవర్నర్ తమిళిసై సోమవారం హర్షం వ్యక్తం చేశారు. దీనిపై డాక్టర్లకు కంగ్రాట్స్ చెబుతూ ట్వీట్ చేశారు. కొన్ని కోట్లమందికి ఈ ప్రయోగం ద్వారా భరోసా కల్పించారని చెప్పారు. ఇండియాలో తయారైన కోవిడ్ వ్యాక్సిన్ ట్రయల్ 1, ట్రయల్ 2 ను న్యూఢిల్లీ ఎయిమ్స్ , హైదరాబాద్ నిమ్స్ లో మనుషులపై ప్రయోగించటం సోమవారం నుంచి మొదలైంది.

For More News..

5 రోజులైనా రిజల్ట్ ఇవ్వలే.. ట్రీట్ మెంట్ చేయలే

డాక్టర్లపై ఒత్తిడి.. తీవ్ర మానసిక ఆందోళనలో వారియర్లు

ఆక్స్‌‌‌‌ఫర్డ్‌‌‌‌ వ్యాక్సిన్ సేఫ్‌.. ఫేజ్ 1 ట్రయల్స్ సక్సెస్

సెక్రటేరియట్ కూల్చివేత కవరేజీకి అనుమతివ్వండి