క్లౌడ్​- 9 లాంజ్ ​హుక్కా సెంటర్​పై పోలీసుల రైడ్

క్లౌడ్​- 9 లాంజ్ ​హుక్కా సెంటర్​పై పోలీసుల రైడ్

ఓనర్, మేనేజర్​పై కేసు నమోదు  

గచ్చిబౌలి, వెలుగు :  రూల్స్ కు వ్యతిరేకంగా నిర్వహిస్తున్న హుక్కా సెంటర్​పై మాదాపూర్ ​జోన్​ ఎస్​ఓటీ పోలీసులు రైడ్​చేశారు. ఇద్దరిని అదుపులోకి తీసుకొని హానికరమైన ప్లేవర్స్​ను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. గచ్చిబౌలి అంజయ్య నగర్​కు చెందిన మత్తారి రమేష్(27) డీఎల్ఎఫ్​ రోడ్డులో  క్లౌడ్​- 9 లాంజ్​ హుక్కా సెంటర్ నిర్వహిస్తున్నాడు. అందులో అంజయ్యనగర్​కు చెందిన బాలం శశికుమార్(29)  మేనేజర్​గా చేస్తున్నాడు.

ALSO READ ;లుక్‌ అవుట్ నోటీసు రద్దు చేయండి

హుక్కా సెంటర్​లో హానికరమైన ప్లేవర్స్​వాడుతుండడం, స్మోకింగ్​జోన్ ​ఏరియాలో ఫుడ్ అందిస్తూ రూల్స్​బ్రేక్​ చేస్తున్నారనే సమాచారం ఎస్​ఓటీ పోలీసులకు అందింది.  మంగళవారం అర్ధరాత్రి  హుక్కా సెంటర్ పై  రైడ్​ చేశారు. సెంటర్ ఓనర్​, మేనేజర్​ను అదుపులోకి తీసుకొని గచ్చిబౌలి పోలీసులకు అప్పగించగా కేసు నమోదు చేశారు