ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్‌లలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా మరోసారి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం వాటిల్లుతోంది. రెండు రాష్ట్రాల్లో ఆగస్టు 14న మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
వరదల ధాటికి ఉత్తరాఖండ్ రాష్ట్రం మాల్‌దేవ్తాలోని డెహ్రాడూన్ డిఫెన్స్ కాలేజీ భవనం కుప్పకూలింది. రానున్న 24 గంటల్లో, బిలాస్‌పూర్, చంబా, హమీర్‌పూర్, కాంగ్రా, కులు, మండి, సిమ్లా, సిర్మౌర్, సోలన్, ఉనా, కిన్నౌర్, లాహౌల్‌లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఉత్తరాఖండ్‌లోని ఆరు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. డెహ్రాడూన్, పౌరీ, టెహ్రీ, నైనిటాల్, చంపావత్, ఉధమ్ సింగ్ నగర్‌లలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
రెయిన్స్ కారణంగా ఇప్పటివరకు 60 మందికి పైగా మరణించినట్లు అధికారులు చెబుతున్నారు. పాఠశాలలకు రెండు ప్రభుత్వాలు సెలవులు ప్రకటించాయి.