
బడ్జెట్ ప్రకటనలకే పరిమితం అవుతోందన్నారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. ప్రజల ఆకాంక్షలు, ఆశలు తీర్చేలా అమలు జరగడం లేదన్నారు. ప్రతీ ఏడాది బడ్జెట్ పెంచుకుంటూ పోతున్నారన్నారు. కానీ.. అమలు విషయంలో మాత్రం కోతలు పెడుతూ వస్తున్నారన్నారు. పెరిగిన ధరల ప్రకారం డబుల్ బెడ్ రూం ఇళ్లకు రూ. 8 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు భట్టీ. ఉమ్మడి రాష్ట్రంలో సంపద తక్కువ ఉన్నప్పుడు రైతులకు అనేక రకాల సబ్సిడీలు ఇచ్చారన్నారు. ఇచ్చిన సంక్షేమ పథకాలు అందించారన్నారు. ఇప్పుడు సంపద బాగా పెరిగిన తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు పేరుతో రూ. 5000 ఇచ్చి పండగ చేసుకోమంటే ఎలా అంటూ ప్రశ్నించారు. రైతులకు ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చిన సౌకర్యాలు, సబ్సిడీలు అన్నీ ఇచ్చి... రైతు బంధు కూడా ఇస్తే వారికి న్యాయం చేసినట్లు అవుతుందన్నారు.
ఇవి కూడా చదవండి: