రిటైర్డ్ అయిన సోమేశ్ కుమార్ కు మళ్లీ పోస్టా.. ?

రిటైర్డ్  అయిన   సోమేశ్ కుమార్ కు మళ్లీ పోస్టా.. ?
  •  సోమేశ్​ కుమార్ పై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఫైర్

ఆంధ్రప్రదేశ్ క్యాడర్ కలిగిన సోమేశ్​ కుమార్ కు తెలంగాణతో సంబంధం ఏంటని, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడిగా పోస్ట్ ఎందుకు ఇచ్చారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రశ్నించారు. రిటైర్డ్ అయిన అధికారులు మిగితా వారికి అవకాశం ఇచ్చి అధికారం నుంచి తప్పుకోవాలని సూచించారు. ఆంధ్రలో పని చేయడం చేతగాక మళ్లీ తెలంగాణలో అడుగు పెట్టారని విమర్శించారు.

ప్రభుత్వ భూములు ధారాదత్తం చేసిన చీఫ్ సెక్రటరీగా సోమేశ్​ కుమార్ చరిత్రలో నిలిచిపోయారని.. ఆయన హయాంలో వేల ఎకరాల భూములు మాయం అయ్యాయని మండిపడ్డారు. ఇప్పుడు హైదరాబాద్ నగరాన్ని తాకట్టు పెట్టడానికే రాష్ట్రానికి వచ్చారని ఆరోపించారు.

కాంగ్రెస్ హయాంలో పేదలకు ఇచ్చిన భూములను కార్పొరేట్ కంపెనీల కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం లాక్కుందన్నారు.  మంత్రి కేటీఆర్ కు బాధ్యత ఉంటే భూముల లెక్కలు చెప్పాలని నిలదీశారు. తెలంగాణ వచ్చి దశాబ్దకాలం గడుస్తున్నా ఇప్పటికీ కృష్ణా జలాల వాటా ఎంతో తేల్చుకోలేకపోవటంపై ఆవేదన వ్యక్తం చేశారు.