హైదరాబాద్: మేడారం జాతరను పురస్కరించుకొని ఒక్క నిమిషానికి నాలుగు బస్సులు వెళ్లేలా ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. ప్రత్యేకంగా నాలుగు వేల బస్సులను ఈ నెల 28వ తేదీ నుంచి ఫిబ్రవ రి 1 వ తేదీ వరకు నడపనున్నట్టు చెప్పారు. వరంగల్, కరీంనగర్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో 51 పాయింట్లు ఏర్పాటు చేశామ న్నారు. రవాణాశాఖ నుంచి 10 వేల మంది సేవల్లో ఉంటారని వివరించారు. ఇవాళ ఆయన మీడియాతో చిట్ చాట్ చేశారు.
మహిళలకు ఉచిత ప్రయాణం ఉంటుందని వివరించారు. మేడరం వెళ్ళేటప్పుడు బస్సులు నిండుతాయి... వచ్చేటప్పుడు ఖాళీగా బస్సులు వస్తాయని, ఇందుకోసం ఫ్రీ బస్సు వర్తించని వారి వద్ద నుంచి 50% చార్జీలు అదనంగా వసూలు చేస్తామన్నారు. ఆర్టీసీ బస్సుల కోసం 50 క్యూలైన్స్ 9 కిలోమీటర్లు ఏర్పాటు చేశా మన్నారు.
ఒకేసారి వెయ్యి బస్సులు పార్కింగ్ చేసేలా వసతులు కల్పించినట్టు చెప్పారు. 7వేల మంది డ్రైవర్లు, 18 వందల మంది కం డక్టర్లు పనిచేస్తారని వివరించారు.
