నర్సాపూర్ లో మహిళలకు వడ్డీ లేని రుణాల చెక్కులు పంపిణీ చేసిన మంత్రి వివేక్ వెంకటస్వామి..

నర్సాపూర్ లో మహిళలకు వడ్డీ లేని రుణాల చెక్కులు పంపిణీ చేసిన మంత్రి వివేక్ వెంకటస్వామి..

మంగళవారం ( జనవరి 20 ) మెదక్ జిల్లా నర్సాపూర్ లో మహిళలకు వడ్డీ లేని రుణాల చెక్కులు పంపిణీ చేశారు మంత్రి వివేక్ వెంకటస్వామి. మహిళలకు రూ. మూడు కోట్ల 50 లక్షల వడ్డీ లేని రుణాల చెక్కులు పంపిణీ చేసిన అనంతరం సభలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి వివేక్ వెంకటస్వామి. మహిళా సంఘాలకు పెట్రోల్ పంపు ఏర్పాటు చేయాలని కలెక్టర్ ను ఆదేశించారు. ఉన్నదానికంటే ఇంకా ఎక్కువ గ్రూపులు క్రియేట్ చేసుకోవాలని.. ఎక్కువ వడ్డీలేని రుణాలు తెచ్చుకోవాలని అన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి.

నర్సాపూర్ మున్సిపాలిటీలోని అందరు మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ చేపడతామని...మాజీ ప్రధాని ఇందిరాగాంధీ మహిళలకు ఒక దారి చూపించిన వ్యక్తి అని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరా గాంధీ పేరు మీద ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగిందని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో సుమారు 40 వేల కోట్ల బిల్లు పెండింగ్ ఉన్నాయని సునీత రెడ్డి గుర్తుంచుకోవాలని అన్నారు.

Also Read : ఫోన్ ట్యాపింగ్ కేసులో ముగిసిన హరీష్ రావు విచారణ

25 లేదా 26 వ తేదీ మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ వస్తుందని.. అభ్యర్థుల పై క్లారిటీ రావాలని అన్నారు. ఈ ఎన్నికల్లో అసమ్మతి నేతల పోరు ఉండకూడదని అన్నారు మంత్రి వివేక్ వేనటస్వామి.కాంగ్రెస్ పలు అభివృద్ధి పనులు చేస్తుందని..బీఆర్ఎస్ పేపర్ లు చూపిస్తు ఒట్లేయించుకుందని.. మనం నిధులు తెచ్చి ఒట్లడుగుదామని అన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి.

జూబ్లీహిల్స్ లో కూడా ముందు మైనస్ లో ఉన్నప్పటికీ.. గెలిచి చూపించామని అన్నారు. నర్సాపూర్ లో అలా కాదని.. ఇక్కడ కాంగ్రెస్ స్ట్రాంగ్ గా ఉందని.. ఖచ్చితంగా గెలుద్దామని అన్నారు. ప్రజల్లో ఉన్న గెలుపు గుర్రాలకే చాన్స్ ఇవ్వండని అన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి.