హైదరాబాద్: తెలంగాణ సీఐడీ సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలోనే తొలిసారిగా పౌర కేంద్రిత పోలీసింగ్ విధానానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ప్రత్యేక కేసుల్లో బాధితుల ఇంటి దగ్గరికే వెళ్లి సీఐడీ ఫిర్యాదులు స్వీకరించనుంది.
మహిళలు, పిల్లలపై జరిగే నేరాలు, శారీరక దాడులు, ఆస్తి వివాదాలు, పోక్సో చట్టం కేసులు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు, బాల్యవివాహాలు, ర్యాగింగ్ వంటి ప్రత్యేక కేసుల్లో బాధితులు పోలీస్ స్టేషన్కు వెళ్లాల్సిన అవసరం లేకుండా మౌఖికంగా లేదా ఫోన్ చేస్తే పోలీసులే ఇంటి దగ్గరికే వచ్చి ఫిర్యాదు స్వీకరిస్తారు. మహిళలు, పిల్లలపై జరిగే నేరాలు, పోక్సో, ర్యాగింగ్ వంటి కేసుల్లో ఫిర్యాదు చేసేందుకు పీఎస్కు వెళ్లాలంటే ఇబ్బంది, భయపడే బాధితులకు ఈ నిర్ణయం ఊరట కల్గించనుంది. సీఐడీ నిర్ణయంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
