‘ప్ర‌జారోగ్యాన్ని గాలికొదిలేసిన ప్ర‌భుత్వాన్ని ఇంత వ‌ర‌కూ చూడ‌లేదు’

‘ప్ర‌జారోగ్యాన్ని గాలికొదిలేసిన ప్ర‌భుత్వాన్ని ఇంత వ‌ర‌కూ చూడ‌లేదు’

TRS పార్టీ అధికారం లోకి వచ్చిన తరవాత ద‌ళితుల‌పై దాడులు, హత్యలు,అత్యాచారాలు జరుగుతున్నాయని అన్నారు CLP నేత భట్టి విక్రమార్క. అసెంబ్లీ మీడియా పాయింట్‌లో నిర్వ‌హించిన ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ… ముందు నుంచి కాంగ్రెస్ పార్టీ దళితులకు అండగా ఉంటూ.. వాళ్లకు భరోసా ఇస్తున్న‌ద‌ని.. కానీ TRS ప్రభుత్వం మాత్రం హత్య కాండ కొనసాగిస్తోంద‌న్నారు. ఈ ఫ్యూడల్ పార్టీ(టీఆర్ఎస్) వచ్చాక రాష్ట్రంలో సామాన్యుడు బతికే పరిస్థితి లేదని చెబుతూ.. సిరిసిల్ల, నేరెళ్ళ ఘటన తో పాటు ఈ మధ్య గజ్వేల్ లో జరిగిన సంఘటన లే ఉదాహరణ అన్నారు. రాష్ట్రం లో దళితుల పై జరుగున్న దాడులపై గవర్నర్ ను కలవలనుకున్నాం…కానీ కరోనా వ్యాప్తి కారణంగా గ‌వ‌ర్న‌ర్ రిప్రజెంటేషన్ మెయిల్ చేయమని చెప్పార‌ని.. తాము మెయిల్ చేయ‌నున్న‌ట్టు చెప్పారు. గ్రామాల్లో కరోనా పేషెంట్ లు హోమ్ క్వారంటైన్‌లో ఉండడం కష్టమ‌ని.. ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యుల కు వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉందన్నారు. కాబ‌ట్టి ప్రతి నియోజకవర్గ స్థాయి లో ఒక క్వారంటైన్ ఏర్పాటు చేయాలన్నారు. ప్రజా ఆరోగ్యాన్ని గాలికి వదిలేసిన ప్రభుత్వాన్ని తాను ఇంత వరకు చూడలేదన్నారు

పోతిరెడ్డిపాడు అంశంపై మాట్లాడుతూ…. శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి ప్రతి రోజూ 11 టీఎంసీ లు తీసుకెళ్తే దక్షిణ తెలంగాణా జిల్లాలలోని 25 లక్షల ఎకరాలకు నీళ్లు అందవ‌ని అన్నారు భ‌ట్టి. ఫ‌లితంగా ఆ ప్రాంతాల‌న్ని ఏడారిగా మార‌తాయ‌ని, ఆ తర్వాత జొన్న చేన్లల్లో రేగు పండ్లు ఏరు కోవడమేన‌న్నారు. కేసీఆర్ తెలంగాణ ద్రోహి అని, అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ కు హాజ‌ర‌య్యే ఉద్దేశ్యం ఆయ‌న‌కు లేద‌ని అన్నారు. 2 tmc ల పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ను… AP సీఎం జగన్ కోసం ఒక టీఎంసీ తగ్గించాడన్నారు. తెలంగాణ కు అన్యాయం చేస్తూ మిగతా వాళ్ళకు న్యాయం చేయాలని చూస్తున్నాడన్నారు. దీనిపై ప్ర‌తిప‌క్షం ప్రభుత్వం పై ఆందోళన కు పిలుపునిస్తుంటే ..కరోనా యాక్ట్ ల త‌మ‌ను అణ‌గదొక్కుతున్నాడన్నారు.

CLP leader Bhatti Vikramarka says that attacks on Dalits since the TRS party came to power