
తెలంగాణలో ప్రతిపక్షం గల్లంతైంది. ఓ జాతీయ పార్టీకి సంబంధించిన ఎల్పీ.. ప్రాంతీయ పార్టీ ఎల్పీలో విలీనం అయింది. టీఆర్ఎస్ లో కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ విలీనం పూర్తయింది. 12మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు స్పీకర్ ను ఈ మధ్యాహ్నం కలిసి .. సీఎల్పీని విలీనం చేయాలని కోరారు. ఎమ్మెల్యేల సంతకాలతో సిద్ధం చేసిన ఓ వినతిపత్రం అందించారు. అసెంబ్లీ రూల్స్ పరిశీలించిన తర్వాత.. స్పీకర్ ఆ విజ్ఞప్తిని అంగీకరించారు. సీఎల్పీ విలీనం పూర్తయినట్టు అసెంబ్లీ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.
పార్టీ మారిన ఎమ్మెల్యేల నుంచి విజ్ఞప్తి వచ్చిన 4 గంటల్లోనే స్పీకర్ కార్యాలయం విలీన ప్రక్రియ పూర్తిచేసింది.
సీఎల్పీని టీఆర్ఎస్ఎల్పీలో విలీనం చేస్తూ (నోటిఫికేషన్) బులెటిన్ జారీ చేశారు అసెంబ్లీ సెక్రెటరీ.
