
Reliance Power: వ్యాపారవేత్త అనిల్ అంబానీకి ఢిల్లీ హైకోర్టు నుంచి పెద్ద ఊరట లభించింది. రిలయన్స్ పవర్ నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా, బీఎస్ఈకి ఇచ్చిన సమాచారం ప్రకారం.. రిలయన్స్ పవర్ అనుబంధ సంస్థ రిలయన్స్ NU సన్‌టెక్ ప్రైవేట్ లిమిటెడ్ విద్యుత్ కొనుగోలు ఒప్పందం ప్రతిపాదిత రద్దుపై ఉపశమాన్ని పొందింది. దీంతో రిలయన్స్ పవర్ స్టాక్ నేడు పెరుగుదలను చూసింది.
రిలయన్స్ పవర్ అనుబంధ సంస్థ అయిన రిలయన్స్ NU సన్‌టెక్ ప్రైవేట్ లిమిటెడ్ సోలార్ ఎనర్జీ వ్యాపారంలో ఉంది. ఇటీవల సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈ సంస్థతో కొనుగోలు ఒప్పందాన్ని రద్దు చేసుకోవడం గురించి మాట్లాడింది. దీనిపై రిలయన్స్ పవర్ ఢిల్లీ హైకోర్టులో అప్పీల్ చేసింది. ఈ కేసును విచారిస్తున్నప్పుడు యథాతథ స్థితిని కొనసాగించాలని కోర్టు ఆదేశించటంతో అనిల్ అంబానీకి సంస్థకు భారీ ఊరట లభించింది. బలవంతపు చర్యలు వద్దని కోర్టు సూచించింది.
ALSO READ | ప్రపంచంలో సగం మంది రిచ్ ఇన్వెస్టర్లు డబ్బు దాయబోతోంది అందులోనే.. మరి మీరు..?
ఇటీవల ఆర్‌కామ్ రుణ ఖాతాలపై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకున్న చర్య రిలయన్స్ పవర్‌పై ఎటువంటి ప్రభావం చూపదని కంపెనీ గతంలోనే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. రిలయన్స్ కమ్యూనికేషన్స్ రుణ ఖాతాను మోసంగా ప్రకటించాలన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్ణయం రిలయన్స్ పవర్ వ్యాపార కార్యకలాపాలు, ఆర్థిక స్థితి, వాటాదారులు, ఉద్యోగులు లేదా ఇతర వాటాదారులపై ఎటువంటి ప్రభావం చూపదని అనిల్ అంబానీ కంపెనీ స్పష్టం చేసింది.