పాలిటెక్నిక్ బంగ్లాను కాపాడుకోవాలి : కలెక్టర్ విజయిందిర బోయి

పాలిటెక్నిక్ బంగ్లాను కాపాడుకోవాలి : కలెక్టర్  విజయిందిర బోయి

వనపర్తి, వెలుగు: వనపర్తి పట్టణంలోని చారిత్రాత్మకమైన కృష్ణ దేవరావు భవనానికి రిపేర్లు చేయించి కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ఇన్​చార్జి కలెక్టర్  విజయిందిర బోయి అన్నారు. బుధవారం పట్టణంలోని కేడీఆర్  పాలిటెక్నిక్  కాలేజీని సందర్శించారు. నిర్మాణంలో వాడిన కట్టెలు, టైల్స్, రాజభవన నిర్మాణాన్ని పరిశీలించి కట్టడం అద్భుతంగా ఉందని కొనియాడారు. ఇలాంటి చారిత్రక కట్టడాన్ని భవిష్యతు తరాల కోసం కాపాడుకోవాలన్నారు. 

భవనం శుభ్రం చేయకుండా, నిర్వహణను పట్టించుకోకపోవడం సరైంది కాదన్నారు. రాజావారి భవనం, పాలిటెక్నిక్  కాలేజీ  లైబ్రరీ, తరగతి గదులు, మెట్ల బావిని అడిషనల్​ కలెక్టర్  వెంకటేశ్వర్లు, ఆర్డీవో సుబ్రహ్మణ్యం, భవన ట్రస్ట్  మేనేజర్లు కలెక్టర్ కు చూపించారు.