సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరం : కాంగ్రెస్ నేత నీలం మధు

సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరం : కాంగ్రెస్ నేత నీలం మధు

  పటాన్​చెరు, వెలుగు: సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరం అని కాంగ్రెస్ ​నేత నీలం మధు అన్నారు. బుధవారం ఆయన చిట్కుల్​లోని తన క్యాంప్​ ఆఫీసులో  పటాన్​చెరు నియోజకవర్గానికి చెందిన పలువురు బాధితులకు చెక్కులు అందజేశారు. గుమ్మడిదల మండలం కానుటుకుంట గ్రామానికి చెందిన ఎల్లబోయిన రాములుకు రూ.లక్షా 4 వేలు, అన్నారం గ్రామానికి చెందిన చింతగుడ్డి సువర్ణకు రూ.55 వేలు,  మంబాపూర్​ గ్రామానికి చెంనది కంజర్ల శ్రీనివాస్​కు రూ.60 వేలు, పటాన్​చెరు మండలం రుద్రారం గ్రామానికి చెందిన పి.శంబతకు రూ.లక్షా 9వేల చెక్కులను అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. అనారోగ్యం బారిన పడి ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకుంటున్న పేదలు అప్పుల పాలు కాకూడదన్న ఉద్ధేశ్యంతో  సీఎం రిలీఫ్​ఫండ్​ద్వారా ఆర్థిక సాయం అందిస్తున్నట్లు తెలిపారు.   కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.