అల్లు అర్జున్-రష్మిక కెమిస్ట్రీ రీలోడెడ్.. ఈ తూరి మరింత పవర్ ఫుల్గా నేషనల్ క్రష్!

అల్లు అర్జున్-రష్మిక కెమిస్ట్రీ రీలోడెడ్.. ఈ తూరి మరింత పవర్ ఫుల్గా నేషనల్ క్రష్!

అల్లు అర్జున్-రష్మిక కాంబోలో మరో సినిమా రాబోతున్నట్లు సినీ వర్గాల సమాచారం. పుష్ప1, పుష్ప 2 సినిమాలతో ఈ ఐకాన్ జంట ఆడియన్స్ను ఉర్రుతలూగించింది. మళ్ళీ ఈ కాంబో సెట్ చేయడానికి మేకర్స్ సిద్ధం అయినట్లు తెలుస్తోంది.

లేటెస్ట్ అప్డేట్ ప్రకారం..

అల్లు అర్జున్, డైరెక్టర్ అట్లీ మూవీ కోసం ముగ్గురు హీరోయిన్స్ సెలెక్ట్ చేసినట్లు టాక్. ఇప్పటికే, దీపికా పదుకునే నటిస్తున్నట్లు అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ఇక మిగిలిన ఇద్దరు హీరోయిన్స్లో మృణాల్ థాకూర్ను అలోమోస్ట్ ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఇప్పుడు మూడో హీరోయిన్ ఎవరనే దానిపైనే చర్చ నడుస్తోంది.

ALSO READ : నాని, శ్రీకాంత్ ఓదెల ‘ది ప్యారడైజ్‌’ సినిమాలో హైలైట్ ఫైట్ సీన్ ఇదే !

ఇందులో ముందుగా జాన్వీ కపూర్‌ పేరు వినిపించింది. కానీ, మేకర్స్ మాత్రం రష్మిక మందన్నను సెలక్ట్ చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే, రష్మిక మందన్నతో చర్చలు జరుపుతున్నట్టు టాక్. అన్నీ కుదిరితే ఈ జోడీ మరోసారి తెరపై సందడి చేయడం ఖాయం.

అయితే, మేకర్స్ మాత్రం రష్మిక క్యారెక్టర్కు సంబంధించిన వివరాలు గోప్యంగా ఉంచుతున్నారు. ఈ సినిమాలో తన కెరీర్లోనే అత్యంత సాహసోపేతమైన మరియు లోతైన భావోద్వేగాలను చూపించే పాత్ర పోషించనుందని టాక్.

ఇపుడీ ఈ న్యూస్ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. 'ఐకాన్ జోడీ రిపీట్' అంటూ బన్నీ ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు. ఇదిలా ఉంటే .. అల్లు అర్జున్, రష్మిక పుష్ప 3 షూటింగ్ వచ్చే ఏడాది స్టార్ట్ అవ్వనున్నట్లు సమాచారం. మొత్తానికి పుష్ప 3 కంటే.. ముందుగానే ఈ ఐకాన్ జంట వస్తుండటం విశేషం. 

ఇది అల్లు అర్జున్ నటిస్తున్న 22వ సినిమా కాగా, అట్లీ డైరెక్ట్ చేస్తున్న 6వ సినిమా. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. అతిత్వరలో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీని దాదాపు రూ.800 కోట్ల బడ్జెట్తో నిర్మిస్తున్నారని అంచనా. అందులో రూ.200 కోట్ల నిర్మాణ వ్యయంతో పాటు రూ.250 కోట్ల  VFX పనులకు కేటాయిస్తున్నట్లు సమాచారం.