ఖాజీపేట మార్కెట్ లో వ్యాపారాలు నిర్వహించేలా చర్యలు : చాహత్ బాజ్ పాయ్

ఖాజీపేట మార్కెట్ లో వ్యాపారాలు నిర్వహించేలా చర్యలు : చాహత్ బాజ్ పాయ్

వరంగల్​సిటీ, వెలుగు: ఖాజీపేట మార్కెట్ లో వ్యాపారాలు నిర్వహించేలా చర్యలు చేపట్టాలని బల్దియా కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ అధికారులను ఆదేశించారు. బుధవారం కమిషనర్ నగర పరిధిలోని ఖాజీపేట మార్కెట్, బాలసముద్రం ప్రాంతాల్లో ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రోడ్లపై వ్యాపారాలు నిర్వహించడం వల్ల వినియోగదారులు మార్కెట్ లోకి రావడంలేదని, కాజీపేట మార్కెట్ కు సంబంధించి స్థానిక  మార్కెట్ దారులు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో రోడ్డుపై కూరగాయలు అమ్మే వారిని మార్కెట్ లో వ్యాపారాలు చేసుకునేలా చూడాలన్నారు. 

ఇంటిగ్రేటెడ్ నాన్ వెజ్ మార్కెట్లను వినియోగంలోకి తీసుకురావాలన్నారు. బాలసముద్రంలోని   కోకో పిట్ యూనిట్ ను పరిశీలించిన కమిషనర్  నిర్వహణ బాగుందని కొబ్బరి బొండాల వ్యర్థాలు ఎక్కువగా పేరుకు పోయి ఉన్నాయని వేగవంతంగా ప్రాసెసింగ్ చేసి నిల్వ లేకుండా చూడాలని చెప్పారు. ఈ యూనిట్ కార్పొరేషన్ కు మోడల్ గా నిలుస్తుందని, 50 కిలో గ్రాముల బల్క్ వేస్ట్ జనరేటర్ ను కమిషనర్ పరిశీలించారు. ఉద్యోగుల హాజరు రిజిష్టర్​ను పరిశీలించారు.