
రాజస్థాన్‌లోని శ్రీ గంగానగర్‌లోని ఓ ఫ్లాట్‌లో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) అక్రమ మాదకద్రవ్యాల తయారీ రాకెట్‌ను బట్టబయలు చేసింది. NCB ఆపరేషన్‌లో మెఫెడ్రోన్ (MD ) అనే నిషేధిత డ్రగ్ ను తయారీ చేస్తున్న ల్యాబ్‌ను సీజ్ చేశారు. ఈ ల్యాబ్‌ను నడుపుతున్న ఇద్దరు స్కూల్ టీచర్స్ ను అరెస్టు చేశారు.
శ్రీగంగానగర్ పరిధిలోని రిధి సిద్ధి ఎన్‌క్లేవ్‌లోని డ్రీమ్ హోమ్స్ అపార్ట్‌మెంట్‌లోని ఒక ఫ్లాట్‌లో 780 గ్రాముల డ్రగ్ స్వాధీనం చేసుకున్నారు. అదనంగా అసిటోన్, బెంజీన్, సోడియం హైడ్రోజన్ కార్బోనేట్, బ్రోమిన్, మిథైలమైన్, ఐసోప్రొపైల్ ఆల్కహాల్, 4-మిథైల్ ప్రొపియోఫెనోన్ , N-మిథైల్-2-పైరోలిడోన్ వంటి డ్రగ్ తయారీలో ఉపయోగించే అనేక రసాయనాలను స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్ ఉత్పత్తికి ఉపయోగించే ల్యాబ్ పరికరాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
రెండున్నర నెలలుగా డ్రగ్ ఫ్యాక్టరీ నడిపిస్తున్నారు..
అరెస్ట్ ఇద్దరు నిందితులు NCB విచారణలో సంచలన విషయాలు చెప్పారు. డ్రగ్స్ తయారీ చేసేందుకు రెండు నెలల క్రితంగా శ్రీగంగానగర్ లో ఫ్లాట్ అద్దె కు తీసుకున్నట్లు తెలిపారు. వృత్తి రీత్యా ఇద్దరు సైన్స్ టీచర్లు. వారాంతాల్లో ముఖ్యంగా శని, ఆదివారాల్లో ఈ ఫ్లా్ట్ కు వచ్చి డ్రగ్స్ తయారీ చేసేవారు. ఈ వారం సోమవారం కూడా సెలవు పెట్టి డ్రగ్స్ తయారీ చేసేందుకు ఫ్లాట్ కు వచ్చినట్లు తెలిపారు. ఇప్పటివరకు 5కిలోల MD డ్రగ్స్ ను తయారు చేశారని విచారణలో వెల్లడైంది.
ఇప్పటికే రూ.15 కోట్ల విలువైన డ్రగ్స్ అమ్మారు..
తయారు చేసిన 5 కిలోలలో MD డ్రగ్స్ లో 4.22 కిలోలు ఇప్పటికే విక్రయించారు. ఈ డ్రగ్స్ మొత్తం యువతకే అమ్మినట్లు విచారణలో తెలిసింది. NCB ఈ దాడిలో మిగిలిన 780 గ్రాములు స్వాధీనం చేసుకుంది. ఈ బ్యాచ్ మార్కెట్ విలువ రూ.2.34 కోట్లు. ఉత్పత్తి చేయబడిన మొత్తం 5 కిలోల మొత్తం మార్కెట్ విలువ రూ.15 కోట్లుగా అంచనా వేశారు పోలీసులు.
►ALSO READ | రాజస్తాన్ లో కుప్పకూలి పేలిపోయిన ఆర్మీ ఫైటర్ జెట్
గుజరాత్ పోలీసులతో కలిసి NCB ఆపరేషన్ ల్యాబ్ 1పేరుతో దాడులు నిర్వహించింది. రాజస్థాన్‌లోని రెండు జిల్లాలతో పాటు గుజరాత్‌లో కూడా డ్రగ్స్ ల్యాబ్‌లను గుర్తించిరూ. 300 కోట్ల విలువైన మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో మొత్తం ఏడుగురిని అరెస్టు చేశారు. 149 కిలోల మెఫెడ్రోన్‌తో పాటు, 50 కిలోల ఎఫెడ్రిన్ , 200 లీటర్ల అసిటోన్ వంటి వాటి తయారీకి ఉపయోగించే రసాయనాలను కూడా స్వాధీనం చేసుకున్నారు.
ఈ ఆపరేషన్ మూడు నెలల ప్రత్యేక నిఘా తర్వాత జరిగింది. ఈ నెట్‌వర్క్ కింగ్‌పిన్ ను గుర్తించామని త్వరలో అరెస్టు చేస్తామని అధికారులు తెలిపారు.