
స్మార్ట్‌ఫోన్ల ధరలు భారీగా తగ్గనున్నాయి. ప్రైమ్ డే, రక్షాబంధన్, ఇండిపెండెంట్ డే సేల్స్ సీజన్ మొదలు కావడంతో కంపెనీలు ఫోన్లపై భారీ డిస్కౌంట్లను ఆఫర్స్ ప్రకటిస్తూ.. తమ దగ్గర ఉన్న స్టాక్ తగ్గించుకోవాలని ప్రయత్నిస్తున్నాయి. వాస్తవానికి కంపెనీలు తమ ఉత్పత్తిని తగ్గించినప్పటికీ.. అమ్ముడుపోని ఫోన్ల స్టాక్ భారీగా పేరుకుపోవటమే ప్రస్తుతం భారీ ఆఫర్లకు కారణంగా తెలుస్తోంది. ఎక్కువ స్టాక్ ఉన్న కంపెనీలు ఎక్కువగా తగ్గింపులను ప్రకటిస్తాయని నిపుణులు చెబుతున్నారు.
షియోమి, రియల్‌మీ, ఒప్పో వద్ద ఎక్కువ స్టాక్ కౌంటర్ పాయింట్ రిపోర్ట్ ప్రకారం, వివో, శామ్‌సంగ్, యాపిల్, మోటరోలా వద్ద ఇన్వెంటరీ తక్కువగా ఉంది. అయితే వన్‌ప్లస్, షియోమి, ఐకూ, రియల్‌మీ, ఒప్పో, నథింగ్ వద్ద స్టాక్ ఎక్కువగా ఉంది. ఎక్కువ స్టాక్ ఉన్న బ్రాండ్లు ఎక్కువ డిస్కౌంట్లు ఇస్తాయని కౌంటర్ పాయింట్ రీసెర్చ్ డైరెక్టర్ తరుణ్ పాఠక్ అన్నారు. దీపావళి సీజన్ ముందు స్టాక్ క్లియర్ చేయడానికి స్మార్ట్‌ఫోన్, కన్స్యూమర్ టెక్ కంపెనీలు అమెజాన్ ప్రైమ్ డే వంటి సేల్స్ ఈవెంట్లలో భారీ డిస్కౌంట్లు ఆఫర్ చేస్తున్నాయి.
ఉదాహరణకు, శామ్‌సంగ్ గెలాక్సీ ఎస్24 అల్ట్రా 5జీ దాని ఇప్పటివరకు అతి తక్కువ ధరైన రూ.74,999కి ప్రైమ్ డే ఈవెంట్‌లో అందుబాటులోకి రానుంది. 12 నెలల నో-కాస్ట్ ఈఎంఐ ఆఫర్‌ను కూడా ఇవ్వనుంది. ఇది ప్రీమియం ఫోన్‌లలో ఆకర్షణీయ డీల్‌గా నిలిచింది. యాపిల్ ఐఫోన్ 15 ధర ప్రైమ్ డే సేల్‌లో రూ.57,999 గా ఉంది. కాగా, అమెజాన్ ప్రైమ్‌డే సేల్స్ ఈ నెల 12 నుంచి 14 వరకు జరుగుతాయి.
మిడ్-రేంజ్, బడ్జెట్ సెగ్మెంట్లలో కూడా ఆకర్షణీయ ధరలు ఉన్నాయి. ఐకూ నియో 10ఆర్ 5జీ ధర రూ.23,499కి దొరకనుంది. రూ.2 వేల బ్యాంక్ డిస్కౌంట్, రూ.500 కూపన్, 6 నెలల నో-కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్లను ఇస్తోంది. అలాగే, వన్‌ప్లస్ 13ఎస్ రూ.49,999కి (రూ.5 వేల బ్యాంక్ ఆఫర్, 12 నెలల ఈఎంఐ) అందుబాటులో ఉంది. వన్‌ప్లస్ 13, 13ఆర్, నార్డ్ సీఈ4 లైట్ కూడా డిస్కౌంట్లు, ఆఫర్లతో అందుబాటులో ఉన్నాయి.