నాకు నోబెల్ ఇవ్వాలె : కేజ్రీవాల్

నాకు నోబెల్ ఇవ్వాలె : కేజ్రీవాల్
  • ప్రభుత్వం ఎలా నడిపిస్తున్నానో నాకే తెలుసు

న్యూఢిల్లీ: ఢిల్లీ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అడుగడు గునా ఆటంకా లు సృష్టిస్తోందని సీఎం అర్వింద్ కేజ్రీవాల్ విమర్శించారు. అయినా, తాను ఢిల్లీని డెవలప్ చేశానని, దీనికిగానూ తనకు నోబెల్ ప్రైజ్ ఇవ్వాలన్నారు. ఎల్జీ వీకే సక్సేనా కూడా కేంద్రానికి వంత పాడుతూ సమస్యలు పరిష్కరించడంలేదని ఆరోపించారు. తమ ప్రభుత్వంపై కేంద్రం మొదటినుంచీ కక్ష పూరితంగానే వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఆప్ అధికారంలోకి వచ్చాక ఢిల్లీ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎంతో డెవలప్ అయిందనికేజ్రీవాల్ అన్నారు. ప్రపంచం మొత్తం ఢిల్లీ విద్యా వ్యవస్థను మెచ్చుకుంటోంద ని తెలిపారు.

మేము కొత్త స్కూల్స్ కట్టాలని ప్రయత్నిస్తుంటే.. కేంద్రం అడ్డుకుంటోంది. పేద, మధ్య తరగతి పిల్లలకు నాణ్యమైన విద్య అందకుండా చేస్తోంది. హాస్పిటల్స్ నిర్మాణాలనూ బీజేపీ నేతలు అడ్డుకుంటున్నారు. ప్రభుత్వాన్ని ఎలా నడిపిస్తున్నానో.. అది నాకు మాత్రమే తెలుసు. దీనికిగాను నాకు నోబెల్ ప్రైజ్ ఇవ్వాలి’’ అని కేజ్రీవాల్ అన్నారు. ‘‘మీరే నాకు నోబెల్ ప్రైజ్. ఢిల్లీ వీధుల్లో తిరుగుతున్నప్పుడు ‘మీ పై మాకు ఎంతో నమ్మకం ఉంది’ అని ప్రజలు అంటుంటారు. ‘ఆ నమ్మకాన్ని అలాగే ఉంచండి’ అని వారికి రిప్లై ఇస్తుంటాను..’’ అని ప్రజలనుద్దేశించి ఆప్​ చీఫ్​ కన్వీనర్​ అర్వింద్ కేజ్రీవాల్ అన్నారు.