Good Health: రోజూ డ్రై ఫ్రూట్స్ తింటున్నారా.. ఎంత పడితే అంత తినకూడదు.. ఏది ఎంత తినాలో తెలుసుకోండి..!

Good Health:  రోజూ డ్రై ఫ్రూట్స్ తింటున్నారా.. ఎంత పడితే అంత తినకూడదు.. ఏది ఎంత తినాలో తెలుసుకోండి..!

కొవ్వు శాతం తక్కువుండి... ప్రొటీన్లు ఎక్కువగా ఉండే డ్రై ఫ్రైట్స్​ ని తినడానికి కొందరు ఇష్టపడితే మరికొందరికి అసలు ఇష్టం లేకపోవచ్చు. కానీ కొన్ని గింజలను వంటలలో కాకుండా డైరెక్ట్ గా తింటేనే బాగుంటాయి. ఇప్పుడు చాలా రకాల నట్స్ మార్కెట్లో లభ్యమవుతున్నాయి. కానీ చాలా మందికి రోజుకు ఎంత మోతాదులో తినాలో తెలియక పోవచ్చు. ఏదో తినాలి కదా అని రెండు మూడు నోట్లో వేసుకుని నములుతూ ఉంటారు. ఇవి మోతాదుకు మించి ఉన్నా ఏమి కాదు. కానీ ధర ఎక్కువ కాబట్టి తగిన మోతాదులో ఉంటేనే బెటర్.

డైట్  :  బాదం, జీడిపప్పు..పిస్తా... వేరుశనగ పప్పు తింటే రుచి... ఆరోగ్యం.. అని అందరికీ తెలుసు. జీడిపప్పు నేతిలో వేగించి పాయసం, భీర్ వంటి స్వీట్​ పదార్థాలు చేసేటప్పుడు ఎక్కువగా వాడతారు. అంతేకాదు జీడిపప్పు నాన్​ వెజ్ వంటల్లో కూడా విరివిగా  వాడతారు. కానీ ఇవే కాకుండా వాల్ నట్స్, బ్రెజిల్ నట్స్, పెకాన్, చెస్ట్ నట్స్, హజెల్ వట్స్, మకాడమియా నట్స్​ అని చాలా రకాలున్నాయి. వాటివల్ల  కూడా ఎన్నో లాభాలు  ఉన్నాయి.

బ్రెజిల్ నట్స్ :  క్యాన్సర్ రాకుండా చేస్తాయి. గుండె జబ్బులు కూడా రావు ... థైరాయిడ్ సమస్యను నియంత్రిస్తుంది. దీర్ఘకాలంగా ఆస్తమా ఉన్నవాళ్లు వీటిని తింటే చాలా మంచిది. జీర్ణవ్యవస్థను సమతుల్యం చేస్తాయి. శరీర బరువు తగ్గిస్తాయి. చర్మాన్ని కాంతివంతం చేస్తాయి. రోజు 40 గ్రాములు బ్రెజిల్ నట్స్ తింటే ఆరోగ్యంగా ఉంటారు.

పిస్తా :  అధికబరువు ఉన్నవాళ్లు వీటిని తింటే బరువు తగ్గి నాజూగ్గా తయారవుతారు. పిస్తా పప్పు తింటే బ్లడ్ ప్రెజర్ నియంత్రణలో ఉంటుంది. రోజు 50 గ్రాముల పిస్తా తింటే మంచిది.

హాజెల్ నట్స్ :  గర్భిణులు వీటిని రోజూ తింటే శిశువు మెదడు బాగా అభివృద్ధి చెందుతుంది. విటమిన్ 'ఇ' ఉంటుంది. అనీమియా రాకుండా కాపాడుతుంది. వీటిని రోజూ 50 గ్రాములు తింటే బ్రెస్ట్ క్యాన్సర్ ని రానివ్వదు.

మకాడమియా నట్స్ : హార్ట్ ఎటాక్ రాకుండా కాపాడటంలో మకాడమియా నట్స్​  కీలక పాత్ర పోషించడమే కాదు ఎముకలకు శక్తినిస్తాయి. వీటిలో ఎ, బి విటమిన్స్, ఐరన్, ఫోలేట్, మాంగనీస్, ప్రొటీన్స్, హెల్దీ ఫ్యాట్స్ ఇంకా పవర్ ఫుల్ యాంటీ అక్సిడెంట్స్ ఉన్నా వీటిని రోజూ 40. గ్రాములు తింటే చాలా ఆరోగ్యం.

వాల్​నట్స్ :  వీటిలో ఎక్కువగా ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు ఉంటాయి. ఇవి నిద్రలేమిని పోగొడతాయి. గుండె జబ్బులను దరిచేరనివ్వవు. మెదడు సంబంధిత వ్యాధులను రోగాలను నియంత్రించడంలో తోడ్పడతాయి. ఫ్యాట్ కంటెంట్ ఉండదు కాబట్టి అధిక బరువు సమస్య ఉండదు.

పెకాన్స్ :  ఫోలిక్ యాసిడ్, కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫ రస్, పొటాషియం, జింక్ వంటి ఖనిజ లవణాలు, పోషకాలు ఎక్కువగా ఉంటాయి.  అయితే వీటిని రోజుకి పది గ్రాములు మాత్రమే తినాలి.

చెస్ట్ నట్స్: క్యాన్సర్ రాకుండా పోరాడే శక్తినిస్తాయి. డయా బెటీస్ వల్ల వచ్చే సమస్యలను కూడా తగ్గిస్తాయి. వీటిలో ఫైబర్, మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి మెదడును ఉత్తేజ పరుస్తాయి. కొవ్వును తగ్గిస్తాయి. రక్తకణాలను వృద్ధి చేస్తాయి. వీటిని ఉడకబెట్టి లేదా ఫ్రై చేసి తినొచ్చు.  ఉడకబెడితే క్యాలరీస్ తగ్గుతాయి. 100 గ్రాముల నట్స్ ఉడకబెడితే 120 క్యాలరీలు ఉంటాయి. అదే ఫ్రై చేస్తే 190 క్యాలరీలు ఉంటాయి.

బాదం :  ఇవి శరీరంలో కొవ్వు స్థాయిని తగ్గిస్తాయి. గుండెకు సంబంధించిన వ్యాధులు రాకుండా కాపాడతాయి. జ్ఞాపక శక్తిని పెంచుతాయి. వీటిని రోజూ 30 గ్రాములు తినాలి.

పల్లీలు:  విటమిన్ 'ఎ' పల్లీల్లో ఎక్కువగా ఉంటుంది. మెగ్నీషి యం, పొటాషియం కూడా అధికంగా ఉండటంవల్ల రక్తంలో ప్లేట్ లెట్స్​ పెరగడానికి ఉపయోగపడతాయి. పల్లీలను రోజూ 50 గ్రాములు తింటే మంచిది.

జీడిపప్పు:  ఇది గుండెకి మంచిది. మధుమేహంతో బాధపడే వారికి చాలా ఆరోగ్యాన్నిస్తుంది. వీటిలో విటమిన్ 'ఇ'తో పాటు కాల్షియం, ప్రొటీన్స్, మెగ్నీషియం, ఐరన్, జింక్ ఉంటాయి. రోజూ 10 గ్రాములు ఉంటే ఆరోగ్యానికి మంచిది.