బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముంబైలో ఇటీవల డైరెక్టర్ గోల్డీ బెహల్ పుట్టినరోజు వేడుకకు హాజరైన హృతిక్ రోషన్ మరోసారి వార్తల్లో నిలిచారు. అయితే ఈసారి సినిమా అప్‌డేట్ కారణంగా కాదు.. చేతికర్ర (ఎల్బో క్రచెస్)తో నడుస్తూ కనిపించడం వల్ల అభిమానుల్లో ఆందోళన కలిగింది. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో హృతిక్ ఆరోగ్యంపై ఆరా తీస్తున్నారు అభిమానులు.
ఈ క్రమంలో హృతిక్ స్వయంగా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా క్లారిటీ ఇచ్చారు. తన మోకాలి సమస్యపై తనదైన హ్యూమర్‌తో ఆసక్తికరంగా స్పందించారు. ఎడమ కాలు మోకాలు ఇబ్బందిపెట్టడంతో అలా చేతికర్ర సాయంతో నడిచి వచ్చినట్లు చెప్పారు. “నా శరీరానికి ON / OFF బటన్ ఉంది. నా ఎడమ మోకాలు ఉన్నట్లుండి ఆఫ్ అయింది. భయపడాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం అంతా బానే ఉంది’’అని హృతిక్ తెలిపారు.
హృతిక్ తన పోస్ట్‌లో, “నిన్న నా ఎడమ మోకాలు రెండు రోజుల పాటు పూర్తిగా ఆఫ్ అయిపోయింది. ఇదే నా నార్మల్ లైఫ్. మన శరీరాలు ఎలా పనిచేస్తాయో మనకు పూర్తిగా అర్థం కాదు. కానీ నా శరీరం మాత్రం స్పెషల్ వెర్షన్. ప్రతి అవయవానికి ఓ ON/OFF బటన్ ఉంటుంది” అంటూ సరదాగా రాసుకొచ్చారు.
ఎడమ కాలు, ఎడమ భుజం, కుడి మడమ.. ఇవన్నీ ఎప్పుడైనా మూడ్ వస్తే ఆఫ్ అయిపోతాయని చెప్పారు. షూటింగ్‌లో ‘డిన్నర్’ బదులు ‘లంచ్’! ఇక షూటింగ్ సమయంలో ఎదురైన ఓ సరదా అనుభవాన్ని కూడా షేర్ చేశారు. ఓ కోర్ట్‌రూమ్ సీన్‌లో “Would you like to come home for Dinner?” అనే డైలాగ్ చెప్పాల్సి ఉంటే.. తన నాలుక ఆ రోజు ‘డిన్నర్’ అనే మాటను పలకడానికి నిరాకరించిందట. ఫలితంగా ప్రతీసారి ‘లంచ్’ అని చెప్పేశానని నవ్వుతూ తెలిపారు. ఆ సీన్‌లో తాను ఆశ్చర్యపోవడం, చేతులు ఎత్తడం, తల కొట్టుకోవడం, చివరకు నవ్వుల్లో మునిగిపోవడం అన్నీ జరుగుతూనే ఉన్నాయని పేర్కొన్నారు. అసిస్టెంట్లు పదే పదే చెవిలో సరైన డైలాగ్ చెప్పినా.. చివరి టేక్‌లో కూడా ‘లంచ్’నే చెప్పి మైక్ డ్రాప్ చేశానని తనదైన శైలిలో రాసుకొచ్చారు.
అభిమానులకు ఊరట
ఈ పోస్ట్‌తో హృతిక్‌కు పెద్దగా ప్రమాదమేమీ లేదని అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. అలాగే ఆయన హాస్యం, పాజిటివ్ యాటిట్యూడ్‌పై మరోసారి ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇకపోతే గతేడాది జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి ‘వార్ 2’సినిమాతో వచ్చి డిస్సప్పాయింట్ చేశాడు.
