ఉచిత విద్యుత్ ప్రకటించిన పంజాబ్ సర్కార్

ఉచిత విద్యుత్ ప్రకటించిన పంజాబ్ సర్కార్

చంఢీఘడ్: పంజాబ్ ప్రజలకు  అక్కడి ఆప్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. జూలై 1 నుంచి ప్రతి ఇంటికి 300 యూనిట్ల ఉచిత కరెంట్ ఇస్తున్నట్లు సీఎం భగవంత్ మాన్ శనివారం ప్రకటించారు. భగవంత్ మాన్ నేతృత్వంలోని ఆప్ ప్రభుత్వ 30 రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా భగవంత్ మాన్ ఈ ప్రకటన చేశారు. ‘మా నాయకుడు అరవింద్ కేజ్రీవాల్ తో సమావేశమయ్యాను. అందులో ఓ మంచి నిర్ణయం తీసుకున్నాం. అతి త్వరలో పంజాబ్ ప్రజలకు శుభవార్త చెబుతాను’ అని భగవంత్ మాన్ ట్వీట్ చేశారు. అనుకున్నట్లుగానే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన ఉచిత కరెంట్ హామీని ఆప్ నెరవేర్చింది. ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పినట్టుగానే ఇప్పటికే ఇంటింటికీ రేషన్ సరఫరా హామీని ఆప్ సర్కార్ అమలు చేస్తోంది. అలాగే 25 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. రాష్ట్రంలో సరిపడా విద్యుత్ ఉత్పత్తి జరుగుతున్నప్పటికీ... కరెంట్ కోతలు, అధిక విద్యుత్ చార్జీలు ఎందుకు ఉన్నాయని ఎన్నికల సమయంలో ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ అప్పటి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. 

మరిన్ని వార్తల కోసం...

ఎల్​కేజీ, యూకేజీ స్టూడెంట్లను లెక్కలోకి తీసుకోవట్లే!

తెలంగాణలో రాహుల్ టూర్ ఖరారు!