ఏపీ బ్రాండ్ పునరుద్ధరించాం.. 13 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వస్తున్నాయి: సీఎం చంద్రబాబు.

ఏపీ బ్రాండ్ పునరుద్ధరించాం.. 13 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వస్తున్నాయి: సీఎం చంద్రబాబు.

సోమవారం ( డిసెంబర్ 8 ) మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం చంద్రబాబు. గత ప్రభుత్వం ఆర్థిక విధ్వంసం చేసిన క్రమంలో రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నామని.. ఎన్నికల సమయంలో చేయలేమని పారిపోలేమని అన్నారు. ప్రజలు ఇచ్చిన బాధ్యతను, రాష్ట్రాన్ని నిలబెడతామని అన్నారు చంద్రబాబు. ప్రజలు 57 శాతం ఓట్ షేర్, 84 శాతం స్ట్రైక్ రేట్ ఇచ్చారని.. ఎన్నో ఎన్నికలు ఫేస్ చేశాం కానీ, మొన్న ఎన్నికలు మాత్రం నమ్మకంతో ప్రజలు నమ్మారని అన్నారు చంద్రబాబు. ఏపీ బ్రాండ్ పునరుద్దరించామని అన్నారు.

సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన ఈ మూడింటిని దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళ్తున్నామని.. నిర్దిష్టమైన విధానంతో సూపర్ సిక్స్ అమలు చేస్తున్నామని అన్నారు చంద్రబాబు. అన్ని వ్యవస్థలని జాగ్రత్తగా చేస్తూ ముందుకి వెళ్తున్నామని.. ఏపీ బ్రాండ్ పునరుద్ధరించాం,క్రమంగా పెట్టుబడులు వస్తున్నాయని అన్నారు. 13 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులకు భాగస్వామ్య సదస్సులో ఒప్పందాలు చేసుకున్నామని అన్నారు చంద్రబాబు. ఎస్ఐపీబీల ద్వారా రూ. 8 లక్షల కోట్ల పెట్టుబడులకు పైగా ఆమోదం తెలియచేశామని అన్నారు చంద్రబాబు. 

గత ప్రభుత్వంలో విద్యావ్యవస్థను అస్తవ్యస్తం చేశారని.. ఈ వ్యవస్థను గాడిలో పెట్టేందుకు సంస్కరణలు తీసుకువచ్చామని అన్నారు. గత పాలకులు విద్య శాఖలోనూ బిల్స్ పెండింగ్ పెట్టారని అన్నారు చంద్రబాబు. పల్లెపండుగ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని అన్నారు. 85 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను వారసత్వంగా ఇచ్చి వెళ్లారని... చెత్తను తొలగించడానికే ఎక్కువ సమయం పడుతోందని అన్నారు.జనవరి 1 నాటికి ఎక్కడా చెత్త లేకుండా చేయాలని లక్ష్యంతో పనిచేస్తు్న్నామని అన్నారు చంద్రబాబు.