వైసీపీకి ఒక గోల్ లేదు... అది ఒక అడ్డగోలు బ్యాచ్: సీఎం చంద్రబాబు

వైసీపీకి ఒక గోల్ లేదు... అది ఒక అడ్డగోలు బ్యాచ్: సీఎం చంద్రబాబు

మహానాడు 2026 లో మాట్లాడుతూ వైసీపీని ఉద్దేశించి ఘాటైన వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు. వైసీపీకి ఒక గోల్ లేదని.. అది ఒక అడ్డగోలు బ్యాచ్ అని అన్నారు. రక్త చరిత్ర రాసేవాళ్ళు స్వర్ణాంధ్ర చరిత్ర రాయలేరని అన్నారు. గొడ్డలి పార్టీ మరోసారి అధికారంలోకి రానే రాదని అన్నారు చంద్రబాబు. వైసీపీ అధికారంలో ఉండగా.. మూడు రాజధానులని అన్నారు, అధికారం పోయాక మావిగన్ అంటున్నారని అన్నారు చంద్రబాబు.

వైసీపీకి రాజధానిపై ఒక విధానం లేదని అన్నారు. వైసీపీ హయాంలో రోడ్లన్నీ గుంతలమయంగా ఉండేవని.. గుంటల్లేని రోడ్లు చేసి చూపిస్తామని చెప్పాం.. చేసి చూపించామని అన్నారు చంద్రబాబు. జాతీయ రహదారుల నుంచి అన్ని రోడ్లపై దృష్టి పెట్టామని అన్నారు. అన్ని రంగాల్లో సమర్థత పెంచుతున్నామని అన్నారు. 

కరెంటు చార్జీలు పెంచమని చెప్పాం.. పెంచలేదని అన్నారు చంద్రబాబు.రెండేళ్లలో కరెంటు చార్జీలు పెంచలేదని.. భవిష్యత్తులో పెంచబోమని అన్నారు.ప్రతి ఇంటిపై సోలార్ పెట్టుకోవాలని.. ప్రతి ఒక్కరు ఈవీకి మారాల్సిన అవసరం ఉందాని అన్నారు చంద్రబాబు. చెత్త పన్ను తొలగించి స్వచ్ఛ ఆంధ్రకు శ్రీకారం చుట్టామని అన్నారు.