మరోసారి దేశంలోనే అత్యంత ధనిక సీఎంగా చంద్రబాబు... పేద సీఎం ఎవరంటే.. ?

మరోసారి దేశంలోనే అత్యంత ధనిక సీఎంగా చంద్రబాబు... పేద సీఎం ఎవరంటే.. ?

ఇండియాలో సీఎంల ఆర్థిక పరిస్థితిపై రిపోర్ట్ రిలీజ్ చేసింది అసోసియేషన్ అఫ్ డెమోక్రసీ రిఫార్మ్స్ ( ADR ). దేశంలోని 30 మంది సీఎంల  ఆర్థిక స్థితిపై విడుదల చేసిన ఈ జాబితా హాట్ టాపిక్ గా మారింది. ఏపీ సీఎం చంద్రబాబు దేశంలోనే అత్యంత ధనిక సీఎంగా నిలిచారు. చంద్రబాబు ఎన్నికల అఫిడవిట్ లో ప్రకారం ఆయన ఆస్తుల విలువ రూ. 931 కోట్లకు పైగా ఉన్నట్లు పేర్కొంది ఏడీఆర్. ఆయన మొత్తం ఆస్తిలో కుటుంబసభ్యుల ఆస్తులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. చంద్రబాబుకు రూ.10 కోట్ల అప్పులు ఉన్నట్లు పేర్కొంది ఏడీఆర్. 

ఇక ఈ జాబితాలో అత్యంత పేద సీఎంగా పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నిలిచారు. మమత కేవలం రూ. 15 లక్షల ఆస్తితో అత్యంత పేద సీఎంగా నిలిచినట్లు పేర్కొంది ఏడీఆర్. డిసెంబర్ 2024కు ముందు జరిగిన అసెంబ్లీ ఎన్నికలు, ఉప ఎన్నికల్లో అఫిడవిట్ ఆధారంగా ఈ జాబితా తయారు చేసింది ఏడీఆర్.

మమతా బెనర్జీ 2021 సెప్టెంబర్‌లో భవానీపూర్ ఉప ఎన్నికలకు ముందు సమర్పించిన అఫిడవిట్ ప్రకారం.. ఆమె దగ్గర రూ. 69 వేల 255 నగదు, రూ.13.5 లక్షల బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. మమత పేరిట ఎలాంటి భూమి, ఇల్లు వంటి ఆస్తులు లేవని తెలుస్తోంది.

ఇతర సీఎంల స్థానాలు:

చంద్రబాబు తర్వాత స్థానంలో రూ. 332 కోట్ల ఆస్తులతో అరుణాచల్ ప్రదేశ్ సీఎం ఖండూ రెండో స్థానంలో నిలిచారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రూ. 30 కోట్ల ఆస్తులతో ఈ జాబితాలో ఏడో స్థానంలో నిలిచారు.మూడో  స్థానంలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య నిలిచారు. ఆయన మొత్తం ఆస్తుల విలువ రూ. 51 కోట్లకు పైగా ఉన్నట్లు పేర్కొంది ఏడీఆర్.