చంద్రబాబును చంద్రముఖి పెట్టెలో బంధించాలి... జగన్ కామెంట్స్

చంద్రబాబును చంద్రముఖి పెట్టెలో బంధించాలి... జగన్ కామెంట్స్

సీఎం జగన్ టీడీపీ అధినేత చంద్రబాబును ఉద్దేశించి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పూతలపట్టులో మేమంతా సిద్ధం బహిరంగ సభలో ప్రసంగించిన ఆయన ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబును చంద్రముఖి పెట్టెలో బంధించి మన రక్తం తాగకుండా మనల్ని మనం కాపాడుకోవాలని అన్నారు. రాష్ట్ర ప్రజలకు మంచి జరుగుతుంటే చంద్రబాబు ఓర్వలేకున్నాడని అందుకే వాలంటీర్లపై ఈసీకి ఫిర్యాదు చేసి ఇంటివద్దకు పెన్షన్లు రాకుండా అడ్డుకున్నాడని అన్నారు. పెన్షన్ల కోసం అవ్వాతాతలు పడుతున్న ఇబ్బందులు చూస్తుంటే చంద్రబాబు మనిషా, శాడిస్టా అనిపిస్తుందని అన్నారు.

తమ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చిందని, బాబు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నెరవేర్చలేదని అన్నారు. ఇంటింటికీ ఒక జాబు, నిరుద్యోగ భృతి, రుణమాఫీ, ఇలా ఇచ్చిన హామీలన్నీ తుంగలో తొక్కాడు తప్ప నెరవేర్చలేదని అన్నారు. ప్రస్తుతం ఏపీలో పెన్షన్ పంపిణీ రద్దు అంశం రాజకీయంగా దుమారం రేపుతున్న సమయంలో చంద్రబాబుపై సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.