ఈ నెలాఖరు వరకు కర్ఫ్యూ పొడిగింపు

ఈ నెలాఖరు వరకు కర్ఫ్యూ పొడిగింపు

ఏపీలో కర్ఫ్యూను నెలాఖరు వరకూ పొడిగించాలని  సీఎం జగన్ ఆదేశించారు. కరోనా తీవ్రత తగ్గాలంటే కనీసం నాలుగు వారాలు  కర్ఫ్యూ ఉండాలన్నారు. కర్ఫ్యూ విధించి 10 రోజులే దాటిందన్న సీఎం.. రూరల్‌ ప్రాంతంలో కేసులు పెరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. వాలంటీర్లు, ఆశావర్కర్లు, సచివాలయాల వ్యవస్థను సమర్థవంతంగా  వినియోగించుకోవాలన్నారు. కరోనా  కారణంగా తల్లిదండ్రులు ఎవరైనా చనిపోతే వారి పిల్లలను ఆదుకునేందుకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
 వారి పేరుమీద కొంత మొత్తాన్ని డిపాజిట్‌ చేసి.. దానిపై వచ్చే వడ్డీ ప్రతినెలా వారి ఖర్చుల కోసం వచ్చేలా ఆలోచనలు చేయాలని ఆదేశించారు సీఎం జగన్.