
ప్రతీ పేద తల్లికి యేటా రూ. 15 వేలు ఇస్తామన్నారు సీఎం జగన్. చిత్తూరు జిల్లాలో అమ్మఒడి పథకం ప్రారంభించిన జగన్..చదువు అనేది పిల్లలకు ఇచ్చే నిజమైన ఆస్తి అని అన్నారు. వచ్చే సంవత్సరం నుంచి స్టూడెంట్స్ కు తప్పనిసరిగా 75 శాతం అటెండన్స్ ఉంటేనే పథకం వర్తిస్తుందన్నారు. అమ్మ ఒడి పథకం ద్వారా పిల్లలను బడికి పంపే దాదాపు 43 లక్షల మంది తల్లులకు లబ్ది చేకూరుతుందన్నారు. చదువుకోవాలంటే ముందు కడుపు నిండాలని.. తల్లులకు ఆర్థికంగా భరోసా ఇచ్చే దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. అర్హత ఉండి లబ్ది పొందని వారు ఫిబ్రవరి 9 లోపు అప్లై చేసుకోవాలన్నారు. అమ్మ ఒడి పథకాన్ని ఒకటి నుంచి ఇంటర్ వరకు చదువుకునే పిల్లలకు వర్తిస్తుందన్నారు.