
హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనం శోభాయమానంగా సాగుతోంది. శనివారం ( సెప్టెంబర్ 6 ) ఉదయం 6 గంటలకు మొదలైన గణేష్ శోభాయాత్ర వైభవంగా సాగుతోంది. ఖైరతాబాద్ బడా గణేష్, బాలాపూర్ గణేష్ ల నిమజ్జనం చూడటానికి వేల సంఖ్యలో భక్తులు తరలి రాగా.. ట్యాంక్ బండ్ జనసందోహం అయ్యింది.
ఈ క్రమంలో సాయంత్రం కాగానే.. ట్యాంక్ బండ్ విద్యుత్ కాంతులతో వెలిగిపోయింది. విద్యుత్ కాంతుల నడుమ గణేష్ శోభాయాత్ర దేదీప్యమాణంగా సాగుతోంది.
విద్యుత్ కాంతులతో ట్యాంక్ బండ్ పొడవునా తీరొక్క గణపతులు బారులు తీరిన దృశ్యాలు కన్నులపండుగగా ఉన్నాయని అంటున్నారు భక్తులు.